రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారత జట్టు సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 24న ఇందోర్‌లో జరగనుంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా సొంతగడ్డ గణాంకాలు చూస్తుంటే చాలా కూల్‌గా ఉన్నాయి. 1988 నుంచి భారత జట్టు కివీస్ జట్టును తమ సొంత గడ్డపై ఏడుసార్లు ఓడించింది.
- 1988లో న్యూజిలాండ్ జట్టును టీమ్ఇండియా 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
- 1995లో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.
- 1999లో భారత గడ్డపై ఇరు జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకోవడంతో టీమ్ఇండియా సిరీస్ విజయం సాధించింది.
- 2010లో న్యూజిలాండ్ భారత గడ్డపై ఐదు వన్డేల సిరీస్ ఆడటానికి వచ్చింది. కానీ ఈసారి కూడా న్యూజిలాండ్ నిరాశపరిచింది. ఈ సిరీస్‌లో భారత జట్టు 5-0తో న్యూజిలాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది.
- 2010 తర్వాత 2016లో భారత గడ్డపై భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో కివీస్ టీమ్ భారత జట్టుకు గట్టిపోటీనిచ్చినా.. సిరీస్ గెలవలేకపోయింది. ధోనీ సారథ్యంలో భారత్.. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.
- 2017లో న్యూజిలాండ్ మళ్లీ భారత్‌కు వచ్చింది. కానీ ఈసారి కూడా కివీస్ జట్టు 2-1తో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
- ప్రస్తుత సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా టీమ్ఇండియా 2-0తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. ఈ విధంగా మరోసారి కివీస్ జట్టు భారత గడ్డపై ఓటమిపాలైంది.
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. మొదట బౌలర్లు 108 పరుగులకే కివీస్‌ను ఆలౌట్ చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.