బంతి కనిపిస్తే చాలు బౌండరీ బాదే టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో తన స్టైల్‌కు విరుద్ధంగా ఆడాడు. తన దూకుడును పక్కనబెట్టి.. పరిస్థితులకు అనుగుణంగా ఎంతో బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. 31 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాచ్‌లో ఒక్క ఫోర్ మాత్రమే బాదాడు. సిక్స్‌లు అస్సలు కొట్టలేదు. దీన్ని గమనిస్తే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిపై సూర్య మాట్లాడుతూ.. "ఈ రోజు స్కై భిన్నమైన వెర్షన్‌ను చూశారు. నేను బ్యాటింగ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఎంతో ముఖ్యం. వాషింగ్టన్ వికెట్ కోల్పోయిన అనంతరం.. ఎవరో ఒకరు ఆటను చివరి వరకూ తీసుకెళ్లాలి. వాషింగ్టన్ రనౌట్‌లో నా తప్పిదమే ఉంది. అక్కడ కచ్చితంగా పరుగు లేదు. ఇక పిచ్ చాలా కఠినంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇలా టర్న్ అవుతుందని అనుకోలేదు. అయితే.. దానికి తగ్గట్టు మారడం ముఖ్యం. మాలో టెన్షన్ తగ్గించుకోవడానికి చివరి ఓవర్‌లో మాకు పెద్ద షాట్ కావాలి. అదే సమయంలో హార్దిక్ నా వద్దకు వచ్చి 'నువ్వు ఈ బంతికి పూర్తిచేయబోతున్నావు' అని చెప్పాడు. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది' అని సూర్య పేర్కొన్నాడు.
షాక్ అయ్యా.. ఈ టీ20 సిరీస్‌కు రూపొందిస్తున్న పిచ్‌లపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా అసహనం వ్యక్తం చేశాడు. 'నిజం చెప్పాలంటే.. ఈ పిచ్ షాక్‌కు గురిచేసింది. ఈ రెండు మ్యాచ్‌లకు కఠినమైన పిచ్‌లే ఉన్నాయి. టీ20ల కోసం వాటిని రూపొందించలేదు. అయితే నేను వాటిని పట్టించుకోను. 120 పరుగులు కూడా గెలుపు స్కోర్ అవుతుంది' అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్‌ఇండియా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత్‌దే విజయం అయినా.. అత్యంత కఠినమైన ఈ పిచ్‌పై రెండు జట్ల పోరాటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ గెలుపుతో సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఇదీ చూడండి: Under 19 Worldcup: మన అమ్మాయిలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?