ETV Bharat / sports

IND VS NZ: సచిన్Xకోహ్లీ.. శుభమన్​ గిల్ సమాధానమిదే..

కొంతకాలంగా సచిన్​xకోహ్లీ ఎవరు గొప్ప అనే ప్రస్తావన క్రికెట్​ ప్రపంచంలో ఎక్కువ వినిపిస్తోంది. తాజాగా దీనిపై సెంచరీలు బాదుతూ సూపర్ ఫామ్​లో ఉన్న యంగ్ ఓపెనర్​ శుభమన్​ గిల్​ స్పందించాడు. ఇంకా తాజాగా న్యూజిలాండ్​తో జరిగిన మూడో వన్డేలోనూ శతకంతో చెలరేగిన అతడు పలు రికార్డులను సాధించాడు. ఆ వివరాలు..

IND VS NZ Submann gill comments on Sachin Kohli
IND VS NZ: సచిన్Xకోహ్లీ.. శుభమన్​ గిల్ సమాధానమిదే..
author img

By

Published : Jan 25, 2023, 11:13 AM IST

గత కొద్ది రోజులుగా సచిన్​xకోహ్లీ ఎవరు గొప్ప అనే ప్రస్తావన ఎక్కువ వస్తోంది. అయితే తాజాగా ఈ విషయమై స్పందించాడు భీకర ఫామ్​లో ఉన్న యంగ్​ ఓపెనర్​ శుభమన్​ గిల్. ''ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఒకరిని క్రికెట్‌ ఆఫ్‌ గాడ్‌గా పరిగణిస్తే.. మరొకరిని నా గురువుగా భావిస్తా. అలాంటిది ఇద్దరిలో ఎవరిని సూపర్‌స్టార్‌గా ఎంచుకుంటానని చెప్పడం కష్టమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నా ఓటు కింగ్‌ విరాట్‌ కోహ్లికే. దీనికి నా దగ్గర సమాధానం ఉంది. సచిన్‌ సార్‌ క్రికెట్‌లో ఉన్నప్పుడు ఆట గురించి పెద్దగా తెలియదు. మా నాన్న ఆయనకు పెద్ద అభిమాని. నాన్న నోటి నుంచే తొలిసారి సచిన్‌ పేరు విన్నాను. అప్పటినుంచి క్రికెట్‌ను ప్రేమిస్తూ వచ్చాను. సచిన్​ను క్రికెట్‌ దేవుడిగానే చూశాను. ఆయన ఆటకు వీడ్కోలు పలికే సమయానికి ఇంకా నేను క్రికెట్‌ నేర్చుకునే దశలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కోహ్లీని నా ఆరాధ్య క్రికెటర్‌గా భావిస్తున్నా. ఒక బ్యాటర్‌గా అతడి నుంచి ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నా. కోహ్లీ భయ్యాతో కలిసి బ్యాటింగ్‌ చేయడమే నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా'' అని అన్నాడు.

కాగా, శుభమన్‌ గిల్‌ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ చెలరేగిపోతున్నాడు. గత నాలుగు వన్డేల్లో ఓ ద్విశతకం, రెండు శతకాలు బాది విధ్వంసం సృష్టించాడు. తాజాగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ శతకంతో మెరిశాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.

మూడో వన్డేలో గిల్ రికార్డులు..
టీమ్​ఇండియా తరఫున అతి తక్కువ వన్డేల్లో 4 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్‌ ధావన్‌ పేరిట ఉండేది. ధావన్‌ 24 మ్యాచ్‌ల్లో ఈ మార్క్​ను అందుకోగా.. గిల్‌ 21 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4 వన్డే సెంచరీలు(21) పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్​కు చెందిన ఇమామ్‌ ఉల్‌ హాక్‌(9) అగ్రస్థానంలో ఉండగా.. క్వింటన్‌ డికాక్‌ (16), డెన్నిస్‌ అమిస్‌ (18), షిమ్రోన్‌ హెట్మేయర్‌ (22) 2, 3, 5 స్థానాల్లో నిలిచారు.
ఇదే మ్యాచ్‌లో గిల్‌ మరో ప్రపంచ రికార్డును సమం చేశాడు. 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం సరసన నిలిచాడు. బాబర్‌ 2016 విండీస్‌ సిరీస్‌లో 360 పరుగులు చేయగా.. గిల్‌ ప్రస్తుత న్యూజిలాండ్‌ సిరీస్‌లో అన్నే పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ఇమ్రుల్‌ కయేస్‌ (349), డికాక్‌ (342), గప్తిల్‌ (330) ఉన్నారు.

ఇదీ చూడండి: వన్డేల్లో అగ్రస్థానానికి టీమ్​ఇండియా.. కివీస్‌పై సిరీస్‌ క్లీన్‌స్వీప్​తో టాప్​లోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.