IND Vs NZ Semi Final Match Viewership : 2023 వరల్డ్‌కప్ తొలి సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను ఓడించి టోర్నీలో ఫైనల్‌కు చేరింది. ఆసాంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ .. ప్రేక్షకులను టీవీలకు అతుక్కునేలా చేసింది. స్టేడియంలో ప్రత్యక్షంగా వేల మంది మ్యాచ్‌ను వీక్షించగా.. కోట్లాది మంది పరోక్షంగా చూశారు. ఈ క్రమంలో అత్యధిక మంది లైవ్ స్ట్రీమింగ్ చేసిన మ్యాచ్‌గా వరల్డ్‌కప్ తొలి సెమీస్ నిలిచింది. ఈ మ్యాచ్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఓ దశలో ఏకంగా 5.3 కోట్ల మంది లైవ్‌లో చూశారు. తొలుత భారత్ ఇన్నింగ్స్‌ను 5.1 కోట్ల మంది చూడగా.. న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో అత్యధికంగా 5. 3 కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డిస్నీ+హాట్‌స్టార్ కూడా ప్రపంచకప్‌లో ఇదే ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను లైవ్‌లో 3.2కోట్ల మంది వీక్షించారు. మెగాటోర్నీ ప్రారంభం కాకముందు అత్యధిక వ్యూస్ పొందిన మ్యాచ్ అదే. అయితే ప్రస్తుత వరల్డ్‌కప్ లీగ్ స్టేజ్‌లో జరిగిన భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఈ మ్యాచ్‌ను 3.5 కోట్ల మంది స్ట్రీమింగ్ చేశారు. అయితే తాజా మ్యాచ్‌తో ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
-
Thank you #TeamIndia fans and Disney+ hotstar users for breaking the record, yet again! 🎉🥳
— Disney+ Hotstar (@DisneyPlusHS) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Now, that’s what we call a knockout performance! 🏏🔥#CWC23 pic.twitter.com/kIez9YAEDy
">Thank you #TeamIndia fans and Disney+ hotstar users for breaking the record, yet again! 🎉🥳
— Disney+ Hotstar (@DisneyPlusHS) November 15, 2023
Now, that’s what we call a knockout performance! 🏏🔥#CWC23 pic.twitter.com/kIez9YAEDyThank you #TeamIndia fans and Disney+ hotstar users for breaking the record, yet again! 🎉🥳
— Disney+ Hotstar (@DisneyPlusHS) November 15, 2023
Now, that’s what we call a knockout performance! 🏏🔥#CWC23 pic.twitter.com/kIez9YAEDy
World Cup 2023 Final : సెమీస్‌కే ఈ విధంగా ఉంటే.. ఇక ఫైనల్ మ్యాచ్ ఎన్ని వ్యూస్ సాధిస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే టీమ్ఇండియా ఫైనల్స్‌కి వెళ్లినందున.. తుదిపోరు ఈ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ లేకపోలేదు. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్.. రెండో సెమీస్ విజేతతో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే 2019 ప్రపంచకప్‌లోనూ భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధికంగా 2.5 కోట్ల మంది లైవ్‌లో చూశారు.
షమీ @ 7 - కివీస్‌ను దెబ్బకు దెబ్బ కొట్టిన రోహిత్ సేన - ఫైనల్స్‌కు భారత్