IND VS NZ Second ODI women cricket: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. మూడు వికెట్ల తేడాతో పరాజయం చెందింది. ఫలితంగా ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. విజయంలో కీలకంగా వ్యవహరించిన అమెలియా కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
271 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 49 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అమెలియా కెర్(119*) సెంచరీ, మ్యాడీ గ్రీన్(52) అర్ధ శతకాలతో మెరిశారు. సోఫీ డివైన్(33) పర్వాలేదనిపించింది. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 4, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 270 రన్స్ చేసింది. కెప్టెన్ మిథాలి(66), రిచా ఘోష్(65) హాఫ్ సెంచరీలతో మెరవగా.. సభినేని మేఘన(49), యస్తిక భాటియా(31) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సోఫీ డివైన్ 2, మిగతా వారు తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: IPL 2022: రిటెన్షన్ ఆటగాళ్లలో భారీ సొమ్ము కైవసం చేసుకుంది ఎవరంటే?