IND vs NZ 1st Test day 3: న్యూజిలాండ్, భారత్ తొలి టెస్టు మూడో రోజు మ్యాచ్‌లో భాగంగా ఓపెనర్ విల్ యంగ్‌ను పెవిలియన్‌కు పంపాడు టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్. కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ను ఔట్ చేశాడు ఉమేశ్ యాదవ్. దీంతో లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది కివీస్.
రెండో రోజు మ్యాచ్‌లో భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది న్యూజిలాండ్. లాథమ్, యంగ్ అర్ధసెంచరీలతో అదరగొట్టి 129 పరుగులు చేశారు. మూడో రోజు యంగ్ 89 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సాహాకు విశ్రాంతి..
మూడో రోజు మ్యాచ్‌లో టీమ్ఇండియా వికెట్ కీపర్‌గా ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకర్ భరత్(KS Bharat news). మెడనొప్పి కారణంగా సాహాకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో భరత్ మైదానంలో వచ్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 345 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(105), జడేజా(50) రాణించారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి:
IND Vs NZ Test: లాథమ్, యంగ్ హాఫ్ సెంచరీలు.. రెండోరోజు కివీస్‌దే!