టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మూడు క్యాచ్‌లు పట్టగా.. అందులో రెండు హైలైట్‌గా నిలిచాయి. ఇందులో విశేషమేమిటంటే సూర్య తీసుకున్న రెండు క్యాచ్‌లు ఒకే స్టైల్‌లో ఉండడం. ఈ రెండు క్యాచ్‌లు పక్కపక్కనబెట్టి చూస్తే రిప్లే చూసినట్లుగా అనిపించడం విశేషం. అవి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అసలే అతడిని ముద్దుగ్గా స్కై అని పిలుస్తుంటారు. అతను గాల్లోకి ఎగిరి రెండు క్యాచ్‌లు పట్టడం చూసిన నెటిజన్లు.. 'నిన్ను స్కై అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపించుకున్నావ్' అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో సూర్య 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.
-
ICYMI - WHAT. A. CATCH 🔥🔥#TeamIndia vice-captain @surya_14kumar takes a stunner to get Finn Allen 👏#INDvNZ | @mastercardindia pic.twitter.com/WvKQK8V67b
— BCCI (@BCCI) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ICYMI - WHAT. A. CATCH 🔥🔥#TeamIndia vice-captain @surya_14kumar takes a stunner to get Finn Allen 👏#INDvNZ | @mastercardindia pic.twitter.com/WvKQK8V67b
— BCCI (@BCCI) February 1, 2023ICYMI - WHAT. A. CATCH 🔥🔥#TeamIndia vice-captain @surya_14kumar takes a stunner to get Finn Allen 👏#INDvNZ | @mastercardindia pic.twitter.com/WvKQK8V67b
— BCCI (@BCCI) February 1, 2023
భలే కూల్ చేశారుగా.. ఇకపోతే ఈ సిరీస్‌లో అన్యాయం ఎవరికైనా జరిగిందంటే అది పృథ్వీ షాకు. వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్‌ను ఆడించారే తప్ప ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పృథ్వీ షాకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికి అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. కనీసం మూడో టి20లోనైనా పృథ్వీని ఆడిస్తారనుకుంటే అదీ జరగలేదు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు వచ్చాయి.
అయితే మ్యాచ్ విజయం తర్వాత పాండ్య చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రోఫీ అందుకున్న పాండ్య దానిని నేరుగా తీసుకెళ్లి పృథ్వీ షా చేతిలో పెట్టాడు. దీంతో షా లోపల భాద ఉన్నా పైకి నవ్వుతూ కనిపించాడు. దీంతో నెటిజన్లు.. షా బాధను పసిగట్టిన పాండ్య తెలివిగా అతని చేతికి ట్రోఫీని అందించి కూల్ చేశాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాండ్య నీ తెలివికి జోహార్లు.. ఒహో చివరికి పృథ్వీ షాను ఇలా కూల్ చేశారా' అంటూ కామెంట్స్, ట్రోల్స్‌తో హోరెత్తించారు.
-
Captain @hardikpandya93 collects the @mastercardindia trophy from BCCI president Mr. Roger Binny & BCCI Honorary Secretary Mr. Jay Shah 👏👏
— BCCI (@BCCI) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to #TeamIndia who clinch the #INDvNZ T20I series 2️⃣-1️⃣ @JayShah pic.twitter.com/WLbCE417QU
">Captain @hardikpandya93 collects the @mastercardindia trophy from BCCI president Mr. Roger Binny & BCCI Honorary Secretary Mr. Jay Shah 👏👏
— BCCI (@BCCI) February 1, 2023
Congratulations to #TeamIndia who clinch the #INDvNZ T20I series 2️⃣-1️⃣ @JayShah pic.twitter.com/WLbCE417QUCaptain @hardikpandya93 collects the @mastercardindia trophy from BCCI president Mr. Roger Binny & BCCI Honorary Secretary Mr. Jay Shah 👏👏
— BCCI (@BCCI) February 1, 2023
Congratulations to #TeamIndia who clinch the #INDvNZ T20I series 2️⃣-1️⃣ @JayShah pic.twitter.com/WLbCE417QU
మొత్తంగా ఈ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమ్ఇండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో టి20లో న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో ఓడించి టీ20 చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ తమ ఖాతాలో వేసుకుంది. శుభ్‌మన్ గిల్ సెంచరీ తోడు భారత బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి: కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన గిల్.. అంత చిన్న వయసులోనే నయా చరిత్ర!