Ind vs Ned World Cup 2023 : Ind vs Ned World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో తలపపడుతున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగులు చేసింది. యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (128*), కేఎల్ రాహుల్ (102) శతకాలతో అదరగొట్టారు. ఇక విరాట్ కోహ్లీ (51), కెప్టెన్ రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బస్ డి లీడే 2, పౌల్ వాన్, వాన్‌డర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు.
పరుగుల వరదలో తడిసిన ప్రేక్షకులు.. దీపావళి పండగ రోజున టీమ్ఇండియా బ్యాటర్లు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు నెదర్లాండ్స్ బౌలర్లను ఓ ఆటాడేసుకున్నారు. ఫలితంగా ఓపెనర్లు సహా విరాట్ అర్ధ శతకాలు బాదగా.. స్టార్ బ్యాటర్లు అయ్యర్, రాహుల్ శతకాలతో చిన్నస్వామి స్టేడియంలో తుఫాన్ సృష్టించారు. వీదిద్దరూ నాలుగో వికెట్‌కు 208 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆఖరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రాహుల్ క్యాచౌట్ అయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు గిల్, రోహిత్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఇక హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే గిల్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్‌తో కెప్టెన్ రోహిత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక రోహిత్ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా భారీ భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఇక విరాట్‌కు కూడా అర్ధ శతకం పూర్తవగానే.. వాన్‌డర్ మెర్వ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత జట్టు బాధ్యతలు రాహుల్, అయ్యర్ తీసుకున్నారు.
ఫాస్టెస్ట్ సెంచరీ.. నెదర్లాండ్స్ బౌర్లలపై విరుచుకుపడ్డ రాహుల్.. 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కాగా, వరల్డ్‌కప్ హిస్టరీలో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రాహుల్ రికార్డుకొట్టాడు. ఈ క్రమంలో రాహుల్.. కెప్టెన్ రోహిత్ (63 బంతులు)ను అధిగమించాడు.
-
𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙔 for Shreyas Iyer in Bengaluru! 💯
— BCCI (@BCCI) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A memorable maiden World Cup HUNDRED for him 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/D2sYE1Xjr4
">𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙔 for Shreyas Iyer in Bengaluru! 💯
— BCCI (@BCCI) November 12, 2023
A memorable maiden World Cup HUNDRED for him 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/D2sYE1Xjr4𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙔 for Shreyas Iyer in Bengaluru! 💯
— BCCI (@BCCI) November 12, 2023
A memorable maiden World Cup HUNDRED for him 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/D2sYE1Xjr4
-
The local lad wows Chinnaswamy! 💯
— BCCI (@BCCI) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A magnificent CENTURY that from KL Rahul 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/u47WSKzrXG
">The local lad wows Chinnaswamy! 💯
— BCCI (@BCCI) November 12, 2023
A magnificent CENTURY that from KL Rahul 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/u47WSKzrXGThe local lad wows Chinnaswamy! 💯
— BCCI (@BCCI) November 12, 2023
A magnificent CENTURY that from KL Rahul 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/u47WSKzrXG
రోహిత్ దెబ్బకు డివిలియర్స్ రికార్డ్ బ్రేక్ - ఆ ఘనత అందుకున్న తొలి కెప్టెన్‌గా హిట్‌మ్యాన్
' కెప్టెన్‌గా ఎఫర్ట్ పెడుతాను - వాళ్లు అలా చేయకపోతే ఏ జట్టుకైనా గెలవడం కష్టమే'