IND Vs IRE T20 : ఇప్పటివరకు విండీస్ టూర్లో ఉన్న టీమ్ఇండియా.. మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తమ సత్తా చాటేందుకు దూకుడుగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. ఈ క్రమంలో పలువురు యంగ్ ప్లేయర్స్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా దాదాపు 11 నెలలుగా మైదానంలోకి అడుగుపెట్టని బుమ్రా ఈ సిరీస్‌లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ సారి టీమ్‌లో యంగ్ ప్లేయర్సే ఎక్కువ ఉండటం వల్ల.. స్టార్ల కొరతే సిరీస్‌కు వెలతిగా మారింది.
-
Our first team huddle in Dublin as we kickstart our preparations for the T20I series against Ireland. #TeamIndia pic.twitter.com/s7gVfp8fop
— BCCI (@BCCI) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our first team huddle in Dublin as we kickstart our preparations for the T20I series against Ireland. #TeamIndia pic.twitter.com/s7gVfp8fop
— BCCI (@BCCI) August 16, 2023Our first team huddle in Dublin as we kickstart our preparations for the T20I series against Ireland. #TeamIndia pic.twitter.com/s7gVfp8fop
— BCCI (@BCCI) August 16, 2023
ఇటీవల వెస్టిండీస్‌తో ఆడిన జట్టులో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయినా ఉన్నాడు. అతను ఈ సిరీస్‌కు తను కూడా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, జితేశ్ శర్మలు ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలవనున్నారు. వీరందరూ ఐపీఎల్‌లో సత్తా చాటినందను బుమ్రా వీరిపై భరోసా పెట్టుకోవచ్చు.
ఆ ఇద్దరు..
Bumrah Ireland Series : గాయం కారణంగా గత కొంత కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా ఐర్లాండ్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. పరిమిత ఓవర్లలో పవర్‌ఫుల్ బౌలర్‌గా రాణించిన బుమ్రా.. ఈ సిరీస్‌లో ఎలా ఆడనున్నాడో అంటూ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక బుమ్రా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న బీసీసీఐ.. అతన్ని వన్డేల్లో కాకుండా టీ20 మ్యాచ్‌లతో ఆడించి అతనిపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నించింది. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్‌తో పాటు విండీస్ సిరీస్‌లో చెలరేగిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మను ఐర్లాండ్ సిరీస్‌కు ఎంచుకుంది. ఈ క్రమంలో ఇతని ఆటను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
-
💬 💬 "Very happy to be back."
— BCCI (@BCCI) August 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Captain Jasprit Bumrah - making a comeback - takes us through his emotions ahead of the #IREvIND T20I series. #TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/IR9Rtp26gi
">💬 💬 "Very happy to be back."
— BCCI (@BCCI) August 17, 2023
Captain Jasprit Bumrah - making a comeback - takes us through his emotions ahead of the #IREvIND T20I series. #TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/IR9Rtp26gi💬 💬 "Very happy to be back."
— BCCI (@BCCI) August 17, 2023
Captain Jasprit Bumrah - making a comeback - takes us through his emotions ahead of the #IREvIND T20I series. #TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/IR9Rtp26gi
వారిని తేలిగ్గా తీసుకోలేం..
India Vs Ireland 2023 :విండీస్‌తో టీ20 సిరీస్ ఓటమి నేపథ్యంలో ఇప్పుడు ఐర్లాండ్‌ను తేలిగ్గా తీసుకుంటే మరోసారి టీమ్ఇండియాకు గట్టి దెబ్బ తప్పదు. ఇటీవల 2024 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఐర్లాండ్ జట్టు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌తో పాటు హ్యారీ టెక్టార్, ఆండ్రూ బల్‌బర్నీ, మార్క్ అడైర్, టకర్, డాక్‌రెల్, కర్టీస్ కాంఫర్, జోష్ లిటిల్ లాంటి ఆటగాళ్లతో ఆ టీమ్ మెరుగ్గానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆకట్టుకున్న పేసర్ జోష్ లిటిల్.. అంతర్జాతీయ క్రికెట్లోనూ దూసుకుపోవాలనే పట్టుదలతో ఉన్నాడు. స్టిర్లింగ్‌తో పాటు కాంఫర్, డాక్‌రెల్, మార్క్ అడైర్, ఫియాన్ హ్యాండ్.. తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో భారత్‌ను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు. గత సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్య ఛేదనలో 221 పరుగులు చేసి భారత్‌ను ఐర్లాండ్ భయపెట్టింది. చూస్తుంటే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోకి టీమ్ఇండియాను నెట్టేందుకు ఐర్లాండ్ సిద్ధమౌతున్నట్లు అనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)..
భారత్: రుతురాజ్, యశస్వి, తిలక్, సంజు శాంసన్, రింకు సింగ్, శివమ్ దూబె, సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ;
ఐర్లాండ్: బల్‌బర్నీ, స్టిర్లింగ్, టకర్, టెక్టార్, ఫియాన్ హ్యాండ్, డాక్‌రెల్, కర్టీస్ కాంఫర్, మార్క్ అడైర్, మెకర్థీ, జోష్ లిటిల్, బెంజమిన్ వైట్.
-
Ireland 🇮🇪, here we come ✈️ #TeamIndia | #IREvIND pic.twitter.com/A4P66WZJzP
— BCCI (@BCCI) August 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ireland 🇮🇪, here we come ✈️ #TeamIndia | #IREvIND pic.twitter.com/A4P66WZJzP
— BCCI (@BCCI) August 15, 2023Ireland 🇮🇪, here we come ✈️ #TeamIndia | #IREvIND pic.twitter.com/A4P66WZJzP
— BCCI (@BCCI) August 15, 2023
Sanju Samson Ireland T20 : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. సంజూ స్థానంలో అతడు!
Ind vs Ire Live Streaming : ఐర్లాండ్‌తో తొలి సమరానికి భారత్ 'సై'.. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?