ETV Bharat / sports

Ind vs Ire T20 : ఐర్లాండ్​పై తొలి టీ20లో భారత్ విజయం.. రీఎంట్రీలో అదరగొట్టిన బుమ్రా - Bumrah VS Ireland

Ind vs Ire T20 : ఐర్లాండ్​ పర్యటనలో భారత్.. తొలి టీ20 మ్యాచ్​లో డక్​వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగులు తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్​లో టీ20 సిరీస్​లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది.

Ind vs Ire T20
Ind vs Ire T20
author img

By

Published : Aug 18, 2023, 11:04 PM IST

Updated : Aug 19, 2023, 8:58 AM IST

Ind vs Ire first T20 : మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి పోరులో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 6.5 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేశారు. అప్పటికి భారత్‌ స్కోరు 47/2. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం అప్పటికి భారత్‌ 2 పరుగుల ముందంజలో ఉంది. దీంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆతిథ్య జట్టును 139 పరుగులకు కట్టడి చేసింది. ఎనిమిదో వికెట్​లో వచ్చిన మెకర్థీ (51* 33 బంతుల్లో 4x4, 4x6) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు, కాంఫర్ (39 పరుగులు)తో రాణించడం వల్ల ప్రత్యర్థి జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం 140 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా 6 ఓవర్లు ముగిసేసరికి 45-0 పటిష్ఠ స్థితిలో ఉంది. కానీ ఏడో ఏవర్​ బౌలింగ్ చేసేందుకు వచ్చిన క్రెయింగ్ యంగ్.. భారత్​ను దెబ్బకొట్టాడు. ఇదే ఓవర్లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (24)​తో పాటు, వన్​డౌన్​లో వచ్చిన తిలక్ వర్మ (0) ను కూడా డకౌట్​ చేశాడు. తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.

Bumrah VS Ireland : సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. మొదటి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి తన ఫామ్​ను చాటుకున్నాడు. ఆ తర్వాత స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఫలితంగా ఐర్లాండ్.. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ మెకర్థీ, కాంఫర్ పోరాటంతో జట్టు స్కోరు వంద దాటింది. భారత బౌలర్లలో బుమ్రా, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండు, అర్షదీప్ ఒక వికెట్ పడగొట్టారు.

Shooting World Championships 2023 : భళా ఇషా సింగ్‌.. హైదరాబాదీ అమ్మాయి అదిరే ప్రదర్శన.. భారత్‌కు తొలి పసిడి

Ashwin On Friendship Comments : 'టీమ్ఇండియా ఆటగాళ్లు ఫ్రెండ్స్​గా మారడం కష్టం'.. వ్యాఖ్యలపై స్పందించిన అశ్విన్​

Last Updated : Aug 19, 2023, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.