ETV Bharat / sports

Ind vs Ire Live Streaming : ఐర్లాండ్​తో తొలి సమరానికి భారత్​ 'సై'.. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ind s Ire Live Streaming : టీమ్ఇండియా యువ జట్టు ఐర్లాండ్​తో టీ20 సిరీస్ శుక్రవారం నుంచి ​ ​ప్రారంభంకానుంది. ఈ జట్టుకు ​జస్​ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ మ్యాచ్​లన్నీ ఎక్కడ లైవ్​ ప్రసారం కానున్నాయంటే!

Ind s Ire Live Streaming
భారత్ ఐర్లాండ్ ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్
author img

By

Published : Aug 17, 2023, 6:07 PM IST

Ind s Ire Live Streaming : వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న భారత్.. శుక్రవారం నుంచి ఐర్లాండ్​తో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఆడనుంది. ఫాస్ట్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా నాయకత్వంలో.. టీమ్ఇండియా యువ జట్టు ఐర్లాండ్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్​ శుక్రవారం డబ్లిన్​ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్​లు ఎక్కడ లైవ్​ స్ట్రీమింగ్ అవ్వనున్నాయంటే...

ఐర్లాండ్​తో జరిగే మ్యాచ్​ల ప్రసార హక్కులను టీవీ 18 దక్కించుకుంది. దీంతో ఐర్లాండ్ సిరీస్​కు టీవీ 18 అధికారిక బ్రాడ్​కాస్టర్​గా వ్యవహరించనుంది. అందుకని ఈ మ్యాచ్​లు టీవీ 18 ఛానెల్​లో టెలికాస్టింగ్ కానున్నాయి. అలాగే జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. అయితే ఈ మూడు మ్యచ్​లకు కూడా డబ్లిన్ మైదానం వేదికకానుంది. మ్యాచ్​లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. కాగా చాలా రోజుల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన బౌలర్ బుమ్రా.. ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఆయితే ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ వైస్​కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

ఎప్పుడెప్పుడు మ్యాచ్​లు జరగనున్నాయి?

  • మొదటి టీ20 ఆగస్ట్ 18
  • రెండో టీ20 ఆగస్ట్​ 20
  • మూడో టీ20 ఆగస్ట్ 23.

Rinku Singh International Debut : ఐపీఎల్​ సంచలనం రింకూ సింగ్​ ఈ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైనట్టే. అయితే మొదటిసారి సెలెక్టర్ల పిలుపు అందుకున్న రింకూపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సిరీస్​లో సత్తాచాటితే రింకూ సింగ్​కు టీమ్ఇండియాలో మంచి భవిష్యత్ ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వికెట్ కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మ కూడా మొదటిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు..
జస్​ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, షహ్​బాజ్ అహ్మద్, సంజు శాంసన్ (వికెట్ కీపర్) , జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.