ETV Bharat / sports

ప్రాక్టీస్​ అదిరింది.. ఇంగ్లాండ్​పై భారత్ ఘనవిజయం - టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన వార్మప్ మ్యాచ్​లో అద్భుత విజయం సాధించింది టీమ్ఇండియా. ఇంగ్లాండ్ విధించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించింది.

india
భారత్
author img

By

Published : Oct 18, 2021, 11:07 PM IST

టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది టీమ్ఇండియా. అందుకు తగ్గట్లే ఆరంభ వార్మప్ మ్యాచ్​లోనే అదరగొట్టింది. దుబాయ్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టు విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి అసలు మ్యాచ్​లకు ముందు ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.

ఇంగ్లాండ్ విధించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రాహుల్, ఇషాన్ కిషన్.. టీమ్ఇండియాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రాహుల్ తన క్లాస్ ఇన్నింగ్స్​తో 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 51 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన కోహ్లీ (11) నిరాశ పర్చినా.. పంత్​తో కలిసి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు కిషన్. 46 బంతుల్లో 70 పరుగులు చేసిన అనంతరం ఇతడు రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు (మరో ఆటగాడికి బ్యాటింగ్​ ఇచ్చేందుకు). అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8) విఫలమయ్యాడు. చివర్లో పాండ్యా (12) మెరవడం వల్ల కోహ్లీసేన విజయం సాధించింది.

రాణించిన ఇంగ్లాండ్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​కు శుభారంభం అందించేందుకు కృషి చేశారు ఓపెనర్లు జాసన్ రాయ్ (17), బట్లర్(18). కానీ వీరిద్దరినీ పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆనందం నింపాడు షమీ. తర్వాత వచ్చిన డేవిడ్ మలన్ (18) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అనంతరం బెయిర్​స్టో, లివింగ్​స్టోన్ గొప్పగా ఆడారు. భారత బౌలర్లను సమర్థవంతంగా కాచుకుంటూ పరుగులు సాధించారు. వీరి ఇన్నింగ్స్​ దూకుడుగా సాగుతున్న క్రమంలో లివింగ్​స్టోన్​ (30)ను బౌల్డ్ చేశాడు షమీ. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో బెయిర్​స్టో (49)ను బుమ్రా బోల్తా కొట్టించడం వల్ల 163 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. చివర్లో మొయిన్ అలీ (43) కాసేపు మెరవడం వల్ల వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది మోర్గాన్ సేన.

భారత బౌలర్లలో షమీ నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 40 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా, రాహుల్ చాహర్ చెరో వికెట్ సాధించారు.c

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.