ETV Bharat / sports

IND VS ENG: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్​.. బట్లర్​ సూపర్ క్యాచ్​ - ricky ponting records

Rohithsharma: ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​.. మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్​ కెప్టెన్ జాస్ బట్లర్.. శనివారం జరిగిన మ్యాచ్​లో ఓ అద్భుతమైన క్యాచ్​ను పట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

rohith buttler
రోహిత్ బట్లర్​
author img

By

Published : Jul 10, 2022, 12:16 PM IST

Updated : Jul 10, 2022, 3:31 PM IST

Rohithsharma: ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడంతో.. టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ మరో సూపర్​ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 14 అంతర్జాతీయ టీ20ల్లో విజయాలు సాధించిన తొలి కెప్టెన్​గా నిలవగా.. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా 19 మ్యాచ్​లలో విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్​గానూ నిలిచాడు. మరో విజయం సాధిస్తే పాంటింగ్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేస్తాడు.

2003లో పాంటింగ్ ఈ ఘనత సాధించి, అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. అత్యధికంగా వరుస మ్యాచ్‌లలో ఓ జట్టును గెలిపించిన కెప్టెన్‌గా 19 ఏళ్ల నుంచి పాంటింగ్ పేరిటే రికార్డు ఉంది. ఒకవేళ నేడు (జూలై 10న) ఇంగ్లాండ్‌తో జరగనున్న 3వ టీ20లో భారత్ విజయం సాధిస్తే.. అత్యధిక విజయాలు అందించిన అంతర్జాతీయ కెప్టెన్‌గా పాంటింగ్ సరసన రోహిత్ నిలుస్తాడు. దీంతోపాటే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 300 ఫోర్లు కొట్టిన బ్యాటర్​ జాబితాలో చేరాడు హిట్​మ్యాన్​. ఓవరాల్​గా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్​గా, టీమ్ ​ఇండియా నుంచి తొలి బ్యాటర్​గా నిలిచాడు.

బట్లర్​ సూపర్​ క్యాచ్​.. ఇక ఈ రెండో టీ20లో ఇంగ్లాండ్​ కెప్టెన్​ జాస్ బట్లర్​ అద్భుతమైన క్యాచ్​తో మెరిశాడు. భారత ఇన్నింగ్స్​ ఐదో ఓవర్​ వేసిన రిచర్డ్​ గ్లీసన్​ బౌలింగ్​లో.. రోహిత్​ ఫుల్​ షాట్ ఆడటానికి యత్నించాడు. అయితే బంతి టాప్ ఎడ్జ్​ తీసుకుని గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్​ కీపర్​ బట్లర్​ డైవ్​ చేస్తూ క్యాచ్​ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. ఇక ఈ మ్యాచ్​లో రోహిత్​ 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

కాగా, ఈ రెండో టీ20లో ఇంగ్లాండ్​ను చిత్తుగా ఓడించింది భారత జట్టు. తొలి టీ20లో 50 పరుగులతో నెగ్గిన రోహిత్‌ సేన.. శనివారం రెండో మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో తడబడి పుంజుకున్న భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46*; 29 బంతుల్లో 5×4) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. రోహిత్‌ శర్మ (31; 20 బంతుల్లో 3×4, 2×6), రిషబ్‌ పంత్‌ (26; 15 బంతుల్లో 4×4, 1×6) కూడా రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ (4/27), రిచర్డ్‌ గ్లీసన్‌ (3/15) సత్తా చాటారు. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా చెలరేగి ఇంగ్లాండ్‌ను 3 ఓవర్లుండగానే 121 పరుగులకే ఆలౌట్‌ చేశారు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' భువనేశ్వర్‌ (3/15), బుమ్రా (2/10), చాహల్‌ (2/10)ల ధాటికి ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. మొయిన్‌ అలీ (35; 21 బంతుల్లో 3×4, 2×6), డేవిడ్‌ విల్లీ (33 నాటౌట్‌; 22 బంతుల్లో 3×4, 2×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. నామమాత్రమైన చివరి టీ20 ఆదివారం జరుగుతుంది.

ఇదీ చూడండి: రోహిత్​ ఖాతాలో మరో రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్​గా

Last Updated : Jul 10, 2022, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.