ETV Bharat / sports

IND vs ENG: నాలుగో రోజు ఆట పూర్తి.. భారత్ స్కోరు 181/6 - ఇండియా vs ఇంగ్లాండ్ హైలైట్స్

భారత్-ఇంగ్లాండ్​ రెండో టెస్టు డ్రా దిశగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. నాలుగో రోజు 181/6తో నిలిచిన భారత్.. ఐదో రోజు బ్యాటింగ్​ చేసిన దానిబట్టి.. ఈ మ్యాచ్​ ఫలితం ఆధారపడి ఉంటుంది.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 15, 2021, 10:40 PM IST

Updated : Aug 15, 2021, 10:52 PM IST

లార్డ్స్​ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రస్తుతం 154 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. క్రీజులో రిషభ్ పంత్​ (14*), ఇషాంత్​ శర్మ (4*) నిలిచారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో మార్క్ వుడ్ 3, మొయిన్ అలీ 2 వికెట్లతో రాణించారు.

105/3తో టీ విరామానికి వెళ్లిన టీమ్ఇండియా చివరి సెషన్​లో ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. పుజారా- రహానె జంట నాలుగో వికెట్​కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాతి బంతికే వుడ్​ బౌలింగ్​లో స్లిప్స్​లో దొరికిపోయాడు పుజారా. మరికాసేపటికే పుజారా, జడేజాను మొయిన్​ అలీ వెనక్కి పంపాడు. దీంతో 155/3తో పటిష్టంగా ఉన్న టీమ్ఇండియా 175/6కి మారిపోయింది. 82 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక చివరి రోజు తొలి సెషన్​ను పూర్తిగా ఆడితే ఈ టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఉంటాయి.

పుజారా- రహానె భాగస్వామ్యం..

నాలుగో రోజు ఆటలో పుజారా- రహానె ఆటే హైలైట్​. గత కొద్ది కాలంగా పేలవ ఫామ్​తో సతమతమవుతున్న వీరిద్దరూ ఎట్టకేలకు గాడిలో పడ్డారు. జట్టుకు అవసరమైన పరిస్థితిలో బ్యాట్​కు పని చెప్పారు. అసలు సిసలైన టెస్టు బ్యాటింగ్​ను బయటకు తీశారు. జట్టును సురక్షిత స్థితికి చేర్చారు. దాదాపు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేశారు ఈ ద్వయం. మంచి ఊపు మీద కనిపించిన పుజారా.. ఓ అనవసరపు షాట్​కు పోయి ఔట్​ అయ్యాడు. 206 బంతులు ఆడి 45 పరుగులు చేసిన నయావాల్​.. ఇంగ్లాండ్​ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. అతనికి మరో ఎండ్​లో రహానె చక్కటి సహకారం అందించాడు.

Last Updated : Aug 15, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.