Ind Vs Aus ODI Series : ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇందౌర్ వేదికగా జరిగిన ఈ రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 399/5 స్కోరు చేసింది. ఆ తర్వాత ఆసీస్‌ను 217 పరుగులకే ఆలౌట్ చేసింది. వర్షం కారణంగా ఛేదనను 33 ఓవర్లకు కుదించగా.. భారత బ్యాటర్లు మొత్తం 18 సిక్స్‌లు, 30 ఫోర్లతో మ్యాచ్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. అందులో సూర్య కుమార్ ఒక్కడే ఆరేసి సిక్స్‌లు, ఫోర్లు కొట్టి అద్భుతం సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్ వేదికగా టీమ్‌ఇండియా పలు అరుదైన ఘనతలను సాధించింది. అవేంటంటే..
- వన్డేల్లో 3000కిపైగా సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా టీమ్ఇండియా అవతరించింది.
- ఒక్క ఇన్నింగ్స్‌లో భారత జట్టు అత్యధిక సిక్స్‌లు (18) బాదడం ఇది ఐదోసారి. గతంలో ఆసీస్‌పైనే (2013లో) 19, కివీస్‌పై (2023లో) 19, బెర్ముడాపై (2007లో) 18, కివీస్‌పై (2009లో) 18 సిక్స్‌లను భారత బ్యాటర్లు చితకొట్టారు. ఈ క్రమంలో మొత్తం వన్డే చరిత్రలో భారత్ 3007 సిక్స్‌లతో చరిత్రకెక్కింది.
- ఇందౌర్‌లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు చేసిన అత్యధిక స్కోర్లలో ఇది రెండోది కావడం విశేషం. 2012లో వెస్టిండీస్‌పై 418/5 స్కోరు చేసింది. అయితే, ఇప్పుడు చేసిన 399/5 స్కోరు ఆసీస్‌పై అత్యధికం సాధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ - శ్రేయస్ అయ్యర్ రెండో వికెట్‌కు సరిగ్గా 200 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. వీరిద్దరు కూడా సెంచరీలు సాధించారు.
- ఆసీస్‌పై ప్రస్తుతం మరో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇలా ఆసీస్‌పై ఏడో వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇందులో స్వదేశంలో ఆరు ఉండగా.. ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌ను గెలుచుకుంది.
- ఇందౌర్ వేదికగా ఆడిన ఏడు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించింది. ఇలా ఒక వేదికపై ఓటమి అనేది లేకుండా విజయాలను నమోదు చేసిన నాలుగో జట్టు టీమ్‌ఇండియా. న్యూజిలాండ్ 9 విజయాలు (డునెదిన్ స్టేడియం), పాకిస్థాన్ 8 విజయాలు (బులవాయో), పాకిస్థాన్ 7 విజయాలు (అక్కడి హైదరాబాద్ స్టేడియం).
- ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. ఆసీస్‌పై అశ్విన్ 144 వికెట్లు తీయగా.. ఆసీస్‌పైనే అనిల్ కుంబ్లే 142, పాక్‌పై కపిల్ 141 వికెట్లు పడగొట్టారు.
- ఆసీస్‌పై ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోర్ల జాబితాలో (399/5) ఇది నాలుగోది. 2018లో ఆసీస్‌పై ఇంగ్లాండ్ 481/6 అత్యధిక స్కోరు చేయడం విశేషం. సౌతాఫ్రికా (438/9, 416/5) రెండు సార్లు 400కిపైగా చేసింది.
- ఒకే ఓవర్‌లో అత్యధికంగా పరుగులు ఇచ్చిన ఐదో ఆసీస్ బౌలర్‌గా కామెరూన్ గ్రీన్ నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లోని 44వ ఓవర్‌లో సూర్యకుమార్ నాలుగు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. మరో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో మొత్తం 26 పరుగులు సమర్పించాడు. సైమన్ డెవిస్, దోహర్తి, క్రెయిగ్ మెక్‌డార్మెట్, ఆడమ్ జంపా కూడా గతంలో 26 పరుగులు ఇచ్చుకున్నారు.
- అత్యంత ఎక్కువగా తన పది ఓవర్ల కోటాలో పరుగులు ఇచ్చిన మూడో ఆసీస్ బౌలర్ కామెరూన్ గ్రీన్ (2/103) చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికాపై మిక్ లూయిస్ (2006లో) 0/113), దక్షిణాఫ్రికాపై ఆడమ్ జంపా (0/113) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- ఒక మ్యాచ్‌లో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. ఆసీస్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఐదో బ్యాటర్‌గా సీన్ అబాట్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అబాట్ 5 సిక్స్‌లు కొట్టాడు. అందరికంటే ఎక్కువగా జేమ్స్ ఫాల్కనర్ 2013లో భారత్‌పైనే ఆరు సిక్స్‌లు బాదాడు.
- తొమ్మిదో వికెట్‌కు ఆసీస్ తరఫున అత్యధిక భాగస్వామ్యం నిర్మించిన మూడో జోడీగా సీన్ అబాట్ - జోష్ హేజిల్‌వుడ్ (77 పరుగులు) నిలిచారు. జేమ్స్ ఫాల్కనర్ - క్లింట్ 2013లో భారత్‌పై 115 పరుగులు జోడించారు.
-
Two wickets in an over for @ashwinravi99 💪💪
— BCCI (@BCCI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
David Warner and Josh Inglis are given out LBW!
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/z62CFHTgq1
">Two wickets in an over for @ashwinravi99 💪💪
— BCCI (@BCCI) September 24, 2023
David Warner and Josh Inglis are given out LBW!
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/z62CFHTgq1Two wickets in an over for @ashwinravi99 💪💪
— BCCI (@BCCI) September 24, 2023
David Warner and Josh Inglis are given out LBW!
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/z62CFHTgq1
Ind vs Aus ODi 2023 : టాప్‌లేపిన టీమ్ఇండియా.. మామూలు బీభత్సం కాదుగా..