ETV Bharat / sports

Ind Vs Aus 3rd ODI 2023 : అరుదైన రికార్డ్​పై టీమ్​ఇండియా కన్ను.. అలా జరిగితే ఆ ఘనత సాధించిన తొలి జట్టు మనదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 8:36 PM IST

Ind Vs Aus 3rd ODI 2023 : ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్​ఇండియా.. ఆసీస్‌తో మూడో మ్యాచ్‌ కోసం సిద్ధమవుతోంది. రాజ్‌కోట్‌ వేదికగా బుధవారం జరగనున్న ఈ మ్యాచ్​తో భారత్​ ముంగిట ఓ అరుదైన అవకాశం వచ్చింది. అలా జరిగితే ఆ ఘనత సాధించిన తొలి జట్టు మనదే అవుతుంది. ఆ వివరాలు..

Ind Vs Aus 3rd ODI 2023 : అరుదైన ఘనతపై టీమ్​ఇండియా కన్ను.. గెలిస్తే తొలి జట్టుగా రికార్డ్​!

Ind Vs Aus 3rd ODI 2023 : ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు కీలక సమయంలో భారత ప్లేయర్స్​ ఫామ్‌ను అందిపుచ్చుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఈ చివరి మ్యాచ్‌నూ కూడా గెలిస్తే టీమ్‌ఇండియా ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరుతుంది.

అరుదైన ఘనత.. మొదటి సారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే ఛాన్స్​.. టీమ్​ ఇండియా ముంగిట ఉంది. ఇప్పటి వరకు ఆసీస్​తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్​ల్లో కొన్నింటిలో టీమ్‌ఇండియా విజయం సాధించినా.. క్లీన్‌స్వీప్‌ మాత్రం చేయలేకోపోయింది. ఒకవేళ రేపటి మ్యాచ్​లో గెలిస్తే... క్రికెట్‌లో ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేసిన తొలి జట్టుగా భారత చరిత్ర సృష్టించే అవకాశం దక్కుతుంది. ప్రపంచకప్​ బరిలోకి దిగే ముందు ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్‌ చేస్తే భారత ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పైగా వరల్డ్​ కప్​లో టీమ్‌ఇండియా తమ తొలి మ్యాచ్‌ను (అక్టోబర్ 8న) ఆసీస్‌తోనే ఆడనుంది.

ఓపెనింగ్‌ ఎవరు? మూడో వన్డేలో శుభ్‌మన్‌ గిల్​కు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మతో ఓపెనింగ్​ ఇషాన్‌ కిషన్​ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఉంటారు. అయితే బౌలింగ్‌ విభాగంపై ఆసక్తి నెలకొంది. తుది జట్టులో ఎవరు ఉంటారనేది? ఎందుకంటే రాజ్‌కోట్ వేదిక బ్యాటింగ్‌కు అనుకూలం. ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగితే.. జడేజాతో పాటు మరోసారి అశ్విన్‌ను సెలెక్ట్​ చేసే ఛాన్స్ ఉంది. అలాగే అశ్విన్‌కు పరీక్ష పెట్టినట్లు అవుతుంది. పేస్‌ బాధ్యతలు బుమ్రా, సిరాజ్‌ చూసుకుంటారు.

3rd Odi Ind VS Aus Pitch : పిచ్​ ఎలా ఉందంటే? పిచ్‌ ఎలాగో బ్యాటింగ్‌కు అనుకూలం. గత మూడు వన్డేల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. ఈ పిచ్​పై సగటున 300కుపైగా స్కోరు నమోదు కావొచ్చు. గత మ్యాచ్‌ జరిగిన ఇందౌర్ స్టేడియం కన్నా రాజ్‌ కోట్‌ మైదానం కాస్త పెద్దదే అయినప్పటికీ.. పరుగుల ప్రవాహం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్‌ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది. ఇక మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ, బుమ్రా అందుబాటులో వస్తారు.

Kapil Dev Kidnap : కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఊపిరి పీల్చుకున్న అభిమానులు!

ODI World Cup 2023 : హమ్మయ్య.. వరల్డ్​ కప్​ ముంగిట టీమ్​ఇండియా సమస్యలన్నీ పోయే​.. ఆ ప్లేయర్స్​ సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.