Ind Vs Aus 3rd ODI 2023 : రేపు(సెప్టెంబర్ 27) రాజ్‌కోట్ వేదికగా టీమ్ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నామ మాత్రపు మూడో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు యంగ్ బ్యాటర్ గిల్, పేసర్ మహ్మద్ షమి, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, గాయపడిన అక్సర్ అందుబాటులో ఉండట్లేదు. వీరిందరికీ విశ్రాంతి కల్పించనున్నారు. ఈ విషయాన్ని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. వీరిలో శార్దూల్ ఎలాగో రాణించలేకపోతున్నాడు. అక్సర్ గాయపడ్డాడు.
3rd Odi India Squad Vs Australia : ఇకపోతే ఈ మ్యాచ్‌తో టీమ్ఇండియాలోని పలువురు సార్టు కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలిసింది. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ రేపటి మ్యాచ్‌లో ఆడతారని తెలిసింది. అలాగే రెండో వన్డేకు అందుబాటులో లేని బుమ్రా కూడా ఆడే అవకాశం ఉంది.
ఇంకా ఈ మ్యాచ్‌తో ఇద్దరు ఆస్ట్రేలియా స్టార్లు(India Vs Australia 3rd Odi Squad) రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డే కోసం బరిలో దిగనున్నట్లు సమాచారం అందింది. వీరిద్దరూ నేడు(సెప్టెంబర్ 26) జరిగిన నెట్ సెషన్స్‌లో పాల్గొన్నారు. ఇక స్టార్క్, మ్యాక్సీ వస్తే.. తొలి వన్డే బరిలో దిగిన నాథన్ ఇల్లీస్, రెండో వన్డేలో ఆడిన స్పెన్సర్ జాన్సన్ మూడో మ్యాచ్‌లో ఉండరు.
కాగా, మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా రేపు(సెప్టెంబర్ 27) జరగబోయే ఆఖరి మ్యాచులో టీమ్ఇండియా- ఆస్ట్రేలియా రాజ్‌కోట్ వేదికగా తలపడనున్నాయి. మొదటి రెండు వన్డే మ్యాచులు గెలిచిన టీమ్ ఇండియా ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో రేపు జరగబోయే మ్యాచ్.. ఇరు జట్లకు ప్రపంచ కప్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌గా అవుతుంది. ఇది నామ మాత్రపే మ్యాచ్ అయినా టీమ్ఇండియా మాత్రం ఇందులో కూడా గెలవాలని గట్టిగానే ఆశిస్తోంది.
-
Mohali ✅
— BCCI (@BCCI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyB
">Mohali ✅
— BCCI (@BCCI) September 25, 2023
Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyBMohali ✅
— BCCI (@BCCI) September 25, 2023
Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyB
Kapil Dev Kidnap : కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఊపిరి పీల్చుకున్న అభిమానులు!