Ind vs Aus 1st ODI 2023 : మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో.. భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ప్రత్యర్థి ఆసీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో ఛేదించి గెలుపొందింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (74 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (71 పరుగులు) అర్ధసెంచరీలతో జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత కెప్టెన్ రాహుల్ (58*), సూర్యకుమార్ యాదవ్ (50 పరుగులు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు వికెట్లతో రాణించిన భారత బౌలర్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్.. వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. దీంతో టీమ్ఇండియా.. ప్రస్తుతం మూడు ఫార్మట్లలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
ఆరంభం అదిరెన్.. 277 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు ఘనమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు గిల్, రుతురాజ్ తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు జట్టు రన్‌రేట్ 6కు తగ్గకుండా చూసుకున్నారు. ప్రత్యర్థి జట్లు బౌలర్లనే ఆత్మ రక్షణలో పడేసి.. ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే రుతురాజ్ వన్డే కెరీర్లో తొలి అర్ధ శతకం సాధించాడు.
మరోవైపు గిల్.. కెరీర్లో తొమ్మిదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో 21.4 ఓవర్ వద్ద.. అడమ్ జంపా రుతురాజ్‌ను ఎల్బీడబ్ల్యూగా పెలివియన్ చేర్చాడు. అనంతరం వన్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3).. తొందరపాటులో రనౌట్ అయ్యాడు. ఇక సెంచరీ దిశగా వెళ్తున్న గిల్ కూడా కొంతసేపటికే ఔటయ్యాడు.
రాహుల్-సూర్య ద్వయం.. 151 పరుగులుకు టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్‌కు, ఇషాన్ తోడయ్యాడు. కానీ ఇషాన్ (18) కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్.. చాలా రోజులకు వన్డేల్లో రాణించాడు. అతడు క్రీజులో కుదురుకొని.. రాహుల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరి భాగస్వామ్యం టీమ్ఇండియా విజయాన్ని సులభం చేసింది. ఆఖర్లో సూర్య, రాహుల్ కూడా 50 పరుగుల మార్క్ అందుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 276 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబుషేన్ (39), జోష్ ఇంగ్లిస్ (45), కామెరూన్ గ్రీన్ (31) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇందౌర్ వేదికగా జరగనుంది.
-
India go on top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings after a comfortable win over Australia 💪#INDvAUS📝: https://t.co/klIdaJPHT0 pic.twitter.com/nfwd7h2TgX
— ICC (@ICC) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">India go on top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings after a comfortable win over Australia 💪#INDvAUS📝: https://t.co/klIdaJPHT0 pic.twitter.com/nfwd7h2TgX
— ICC (@ICC) September 22, 2023India go on top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings after a comfortable win over Australia 💪#INDvAUS📝: https://t.co/klIdaJPHT0 pic.twitter.com/nfwd7h2TgX
— ICC (@ICC) September 22, 2023
-
Mohammed Shami has made a strong case for his inclusion in India's starting XI for #CWC23 💥#INDvAUS pic.twitter.com/u1kAPL54kN
— ICC (@ICC) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mohammed Shami has made a strong case for his inclusion in India's starting XI for #CWC23 💥#INDvAUS pic.twitter.com/u1kAPL54kN
— ICC (@ICC) September 22, 2023Mohammed Shami has made a strong case for his inclusion in India's starting XI for #CWC23 💥#INDvAUS pic.twitter.com/u1kAPL54kN
— ICC (@ICC) September 22, 2023
-
No. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH
">No. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iHNo. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH
ICC World Cup History : 10 జట్లు.. ఒకే వరల్డ్ కప్.. ఎవరు తయారు చేశారో తెలుసా?.. కాస్ట్ ఎంతంటే?
Ind Vs Aus ODI : భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డే.. రికార్డుల వేటలో రాహుల్, అశ్విన్!