Ind vs Aus 1st ODI 2023 : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్లన్నీ ఆడిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబుషేన్ (39), జోష్ ఇంగ్లిస్ (45), కామెరూన్ గ్రీన్ (31) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచిన భారత్.. ప్రత్యర్థికి ముందుగా బ్యాటింగ్ అప్పజెప్పింది. ఇక తొలి ఓవర్లలోనే షమీ.. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (4)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్.. మరో ఓపెనర్ వార్నర్‌తో కలిసి మంచి (94 పరుగులు) భాగస్వామ్యం నెలకొల్పారు. డేంజర్‌గా మారుతున్న ఈ జోడీని స్పిన్నర్ రవీంద్ర జడేజా విడగొట్టి.. టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. అతడు వార్నర్‌ను ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన లబుషేన్, గ్రీన్, ఇంగ్లిస్ సమష్టి కృషితో స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. చివర్లో స్టోయినిస్ (29 పరుగులు , 5x4), కెప్టెన్ కమిన్స్ (21 పరుగులు : 9 బంతుల్లో, 2x4, 1x6) వేగంగా ఆడటం వల్ల ఆసీస్ 250+ మార్క్‌ను దాటగలిగింది. ఇక భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి.. వికెట్ లేకుండా 7.80 ఎకనమీతో 78 పరుగులు సమర్పించుకున్నాడు.
వార్నర్@100.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్లో వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో అతడు వన్డేల్లో 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన 43వ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. వార్నర్ ఈ ఘనతను 148 మ్యాచ్‌ల్లో సాధించాడు.
వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన టాప్ 5 బ్యాటర్లు..
- షాహిద్ అఫ్రిదీ (పాకిస్థాన్) - 351 సిక్స్‌లు
- క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 331 సిక్స్‌లు
- రోహిత్ శర్మ (భారత్) - 286 సిక్స్‌లు
- సనత్ జయసూర్య (శ్రీలంక) - 270 సిక్స్‌లు
- ఎంఎస్ ధోనీ (భారత్) - 229 సిక్స్‌లు
-
Innings Break!
— BCCI (@BCCI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A sensational fifer for @MdShami11 in the 1st ODI as Australia are all out for 276 runs.#TeamIndia chase coming up shortly. Stay tuned.
Scorecard - https://t.co/H6OgLtww4N… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/94BglCwLgt
">Innings Break!
— BCCI (@BCCI) September 22, 2023
A sensational fifer for @MdShami11 in the 1st ODI as Australia are all out for 276 runs.#TeamIndia chase coming up shortly. Stay tuned.
Scorecard - https://t.co/H6OgLtww4N… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/94BglCwLgtInnings Break!
— BCCI (@BCCI) September 22, 2023
A sensational fifer for @MdShami11 in the 1st ODI as Australia are all out for 276 runs.#TeamIndia chase coming up shortly. Stay tuned.
Scorecard - https://t.co/H6OgLtww4N… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/94BglCwLgt
-
ICYMI
— BCCI (@BCCI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
10 Overs
1 Maiden
51 Runs
5 Wickets
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎: Watch how @MdShami11 registered his best-ever ODI figures with THAT fifer 👇👇
📹https://t.co/uY04T3xDzO #INDvAUS pic.twitter.com/aCfkXbChS3
">ICYMI
— BCCI (@BCCI) September 22, 2023
10 Overs
1 Maiden
51 Runs
5 Wickets
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎: Watch how @MdShami11 registered his best-ever ODI figures with THAT fifer 👇👇
📹https://t.co/uY04T3xDzO #INDvAUS pic.twitter.com/aCfkXbChS3ICYMI
— BCCI (@BCCI) September 22, 2023
10 Overs
1 Maiden
51 Runs
5 Wickets
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎: Watch how @MdShami11 registered his best-ever ODI figures with THAT fifer 👇👇
📹https://t.co/uY04T3xDzO #INDvAUS pic.twitter.com/aCfkXbChS3
-
India Vs Australia ODI 2023 : ఆ ముగ్గురు బ్యాటర్లు విశ్వరూపం చూపిస్తే పరుగుల వరదే.. ఏం చేస్తారో?
Ind Vs Aus ODI : భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డే.. రికార్డుల వేటలో రాహుల్, అశ్విన్!