Ind vs Afg 3rd T20: బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా రెండో సూపర్‌లో నెగ్గింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుతంగా పోరాాడాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ కూడా 20 ఓవర్లకు 212 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అయితే తొలి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16-1 పరుగులు చేయగా, టీమ్ఇండియా కూడా 16-1తో నిలిచింది. దీంతో మరోసారి డ్రా అవ్వడం వల్ల రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 11-2 పరుగులు చేసింది. అనంతరం అఫ్గాన్ 1 పరుగు చేసి రెండు వికెట్లు కోల్పోయి, ఓటమి పాలైంది. దీంతో టీమ్ఇండియా మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
తొలి సూపర్ ఓవర్ సాగిందిలా
అఫ్గాన్ బ్యాటింగ్ 16-1 (బౌలర్ ముకేశ్ కుమార్)
- తొలి బంతి- సింగిల్+ రనౌట్
- రెండో బంతి- సింగిల్
- మూడో బంతి- ఫోర్ (4)
- నాలుగో బంతి- సింగిల్
- ఐదో బంతి- సిక్స్ (6)
- ఆరో బంతి- త్రీడీ (3)
భారత్ బ్యాటింగ్ 16-1 (బౌలర్ ఓమర్జాయ్)
- తొలి బంతి- సింగిల్
- రెండో బంతి- సింగిల్
- మూడో బంతి- సిక్స్ (6)
- నాలుగో బంతి- సిక్స్ (6)
- ఐదో బంతి- సింగిల్
- ఆరో బంతి- సింగిల్
రెండో సూపర్ ఓవర్ సాగిందిలా
భారత్ బ్యాటింగ్ 11-2 (బౌలర్ ఫరీద్)
- తొలి బంతి- సిక్స్ (6)
- రెండో బంతి- ఫోర్ (4)
- మూడో బంతి- సింగిల్
- నాలుగో బంతి- రనౌట్
- ఐదో బంతి- ఔట్
- ఆరో బంతి- ఔట్
అఫ్గాన్ బ్యాటింగ్ 1-2 (బౌలర్ రవి బిష్ణోయ్)
- తొలి బంతి- ఔట్
- రెండో బంతి- సింగిల్
- మూడో బంతి- ఔట్
- నాలుగో బంతి- -
- ఐదో బంతి- -
- ఆరో బంతి- -
స్కోర్లు
- భారత్- 212/4 (20 ఓవర్లు)
- అఫ్గానిస్థాన్- 212/6 (20 ఓవర్లు)
రోహిత్@5: ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ అఫ్గాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తూ టీ20 కెరీర్లో 5వ సెంచరీ (121* పరుగులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.
-
#TeamIndia Captain @ImRo45 receives the trophy after a dramatic end to the #INDvAFG T20I series 👏👏
— BCCI (@BCCI) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
India win the T20I series 3⃣-0⃣@IDFCFIRSTBank pic.twitter.com/9LQ8y3TFOq
">#TeamIndia Captain @ImRo45 receives the trophy after a dramatic end to the #INDvAFG T20I series 👏👏
— BCCI (@BCCI) January 17, 2024
India win the T20I series 3⃣-0⃣@IDFCFIRSTBank pic.twitter.com/9LQ8y3TFOq#TeamIndia Captain @ImRo45 receives the trophy after a dramatic end to the #INDvAFG T20I series 👏👏
— BCCI (@BCCI) January 17, 2024
India win the T20I series 3⃣-0⃣@IDFCFIRSTBank pic.twitter.com/9LQ8y3TFOq
5వ సెంచరీతో రోహిత్ వరల్డ్ రికార్డ్- చిన్నస్వామి స్టేడియమంతా హిట్‌మ్యాన్ నామమే
కెరీర్ బెస్ట్ పొజిషన్స్‌కు ఆక్షర్, యశస్వి- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్