Ind vs Afg 2nd T20: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అఫ్గాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ 68 పరుగులు, శివమ్ దూబే 63* హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కరీమ్ జనత్ 2, నవీన్ ఉల్ హక్, ఫారుకీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 2-0తో భారత్ వశమైంది. మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు దక్కించుకున్న టీమ్ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది
-
For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
— BCCI (@BCCI) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7
">For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7
లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు తొలి ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక 14 నెలల తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (29 పరుగులు, 16 బంతుల్లో 5x4) దూకుడుగా ఆడాడు. 5.3 ఓవర్ వద్ద విరాట్‌ను నవీనుల్ హక్ ఔట్ చేశాడు. అయినప్పటికీ జైశ్వాల్ తన దూకుడు తగ్గించలేదు. అనంతరం క్రీజులోకి వచ్చిన దూబేతో కలిసి రెచ్చిపోయాడు. మరోవైపు దూబే కూడా దంచేశాడు. వీరి దూకుడుతో భారత్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. గుల్బాదిన్ (57 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించగా, నజీబుల్లా (23 పరుగులు), కరిమ్ (20 పరుగులు), ముజీబ్ (21 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో అఫ్గాన్ టపటపా వికెట్లు పారేసుకుంది. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో రెండు, శివమ్ దూబే 1 వికెట్ దక్కించుకున్నారు.
-
#TeamIndia win the 2nd T20I by 6 wickets, take an unassailable lead of 2-0 in the series.
— BCCI (@BCCI) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/OQ10nOPFs7
">#TeamIndia win the 2nd T20I by 6 wickets, take an unassailable lead of 2-0 in the series.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/OQ10nOPFs7#TeamIndia win the 2nd T20I by 6 wickets, take an unassailable lead of 2-0 in the series.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/OQ10nOPFs7
రోహిత్@150: ఈ మ్యాచ్‌తో టీమ్ఇండియా కెప్టెన్ అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు (150) ఆడిన ప్లేయర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 2007లో ఇంగ్లాండ్‌పై టీ20 అరంగేట్రం చేసిన రోహిత్ నేడు అఫ్గాన్‌పై ఈ ఫీట్ అందుకున్నాడు.
-
Milestone 🚨 - @ImRo45 is all set to play his 150th match in the shortest format of the game.
— BCCI (@BCCI) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Go well, Skip 🫡#TeamIndia pic.twitter.com/1uWje5YNiq
">Milestone 🚨 - @ImRo45 is all set to play his 150th match in the shortest format of the game.
— BCCI (@BCCI) January 14, 2024
Go well, Skip 🫡#TeamIndia pic.twitter.com/1uWje5YNiqMilestone 🚨 - @ImRo45 is all set to play his 150th match in the shortest format of the game.
— BCCI (@BCCI) January 14, 2024
Go well, Skip 🫡#TeamIndia pic.twitter.com/1uWje5YNiq
2024 టీమ్ఇండియా మేజర్ ఈవెంట్స్- అందరి చూపు వీటిపైనే!
అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20 : సిరీస్ పట్టేయాలన్న లక్ష్యంతో భారత్