ETV Bharat / sports

IND Vs SL: భారత్​-శ్రీలంక మ్యాచ్ వేళల్లో మార్పు - teamindia srilanka series reschedule

భారత్​-శ్రీలంక (IND-SL series) మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల మ్యాచ్​ల సమయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు నిర్వహించనున్నారు.

teamindia
భారత్​ లంక సిరీస్​
author img

By

Published : Jul 12, 2021, 5:01 PM IST

ఆతిథ్య జట్టు శ్రీలంకలో కరోనా కలకలం రేగడం వల్ల భారత్​తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్​ను ఇటీవల రీషెడ్యూల్​ చేశారు. మ్యాచ్​ నిర్వహణ తేదీల్లో మార్పులు చేశారు. అయితే ఇప్పుడు మ్యాచ్​ ప్రారంభమయ్యే సమయంలోనూ స్వల్ప మార్పులు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

వన్డేలు సాధారణంగా మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. ఈ సమయాన్ని కాస్త వెనక్కి జరుపుతూ 3 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. టీ20ల ప్రారంభ సమయాన్ని రాత్రి 7 నుంచి 8 గంటలకు మార్చారు.

ఇటీవల ఆతిథ్య జట్టు బ్యాటింగ్​ కోచ్, డేటా అనలిస్ట్​లకు కరోనా సోకింది. దీంతో సిరీస్​ జరుగుతుందో లేదో అన్న అనుమానం కలిగింది. కానీ సిరీస్​ను కచ్చితంగా నిర్వహిస్తామని తెలుపుతూ మ్యాచ్​లను రీషెడ్యూల్​ చేశారు. జులై 13న జరగాల్సిన తొలి మ్యాచ్​ను 18వ తేదీకి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి: హమ్మయ్య.. లంక క్రికెటర్లందరికీ నెగెటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.