ETV Bharat / sports

కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్​లపై వేటు తప్పదా?.. కోచ్ ద్రవిడ్ సమాధానమిదే - రాహుల్​ ద్రవిడ్​ దినేశ్​ కార్తిక్​పై కీలక వ్యాఖ

ప్రపంచకప్​లో టీమ్ఇండియా రెండు మ్యాచ్​లు గెలిచి.. ఓ మ్యాచ్​లో ఓడింది. బంగ్లాదేశ్​తో బుధవారం తలపడనుంది. ఈ నేపథ్యంలో ​కేఎల్​ రాహుల్​, దినేశ్​ కార్తీక్​ల​పై భారత ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే..?

RAHUL DRAVID
రాహుల్​ ద్రవిడ్​
author img

By

Published : Nov 1, 2022, 10:22 PM IST

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. క్రికెట్​ ప్రేమికులు ప్రతి మ్యాచ్​ను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇప్పటికే భారత్​ రెండు మ్యాచుల్లో నెగ్గి.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో భారత్​ ఓటమి పాలైంది. బుధవారం బంగ్లాదేశ్​ను ఢీకొనేందుకు సిద్ధమైంది. అయితే, టీ20 ప్రపంచకప్​లో ఓపెనింగ్‌ సమస్య భారత్‌ను వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జోడీ.. తొలివికెట్​కు 41 పరుగులు మాత్రమే చేశారు. దీంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది.

రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై రోహిత్.. కష్టంగా అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత మ్యాచ్​లో తేలిపోయాడు. ఇక రాహుల్ మాత్రం ఫామ్​లోకి వచ్చేందుకు తంటాలు పడుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క ఇన్నింగ్స్​లోనూ రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో రాహుల్ ఆటతీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు వెన్నునొప్పి కారణంగా దినేశ్​ కార్తీక్​.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​ మధ్యలోనే వెళ్లిపోయాడు. దీంతో ఆ స్థానంలో రిషభ్​ పంత్​ కీపింగ్ చేశాడు. ఈ పరిణామాల మధ్య బంగ్లాతో మ్యాచ్​కు ముందు టీమ్​ఇండియా కోచ్​ ద్రవిడ్​ భారత ఆటగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో దినేశ్​ కార్తీక్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. దాని వల్ల మ్యాచ్ ​నుంచి మధ్యలోనే వెళ్లిపోవాల్సివచ్చింది. బౌన్సర్​ను అందుకోవడానికి చాలా ఎత్తుకు ఎగిరాడు. దీనికారణంగానే అతని వెనుక భాగానికి గాయమైవుండొచ్చని భావిస్తున్నాను. ప్రస్తుతం తన గాయం కాస్త నయమైందని అనుకుంటున్నా. బంగ్లాతో జరిగే మ్యాచ్​లో కార్తీక్​ను ఆడించాలా లేదా అన్న విషయంపై రేపు(బుధవారం నిర్ణయం తీసుకుంటాం" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

"​కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. అతడి గత రికార్డులను చూస్తే అది అర్థమైపోతుంది. అతడు చాలా బాగా బ్యాటింగ్​ చేయగలడు. అయితే టీ20ల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రాహుల్​ బలంగా పుంజుకుంటాడని మాకు నమ్మకం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఓపెనర్లకు సవాలు విసురుతాయి. మేము కేఎల్​ రాహుల్​కు పూర్తి మద్దతునిచ్చాము. ఆటపై అతడు ఎంత ప్రభావం చూపగలడో నాకు తెలుసు" అని రాహుల్​ను వెనకేసుకొచ్చాడు ద్రవిడ్.

ఇదీ చదవండి: న్యూజిలాండ్​-బంగ్లాదేశ్​తో టూర్‌.. కెప్టెన్లుగా హార్దిక్​, ధావన్​​

బంగ్లాదేశ్​తో మ్యాచ్​.. దినేశ్ కార్తీక్​ వర్సెస్​ పంత్​.. ఆడేది ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.