టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంత ఆడినా జట్టులోకి తీసుకోవడం లేదని వాపోయాడు. అయితే రెండేళ్ల క్రితం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పృథ్వీ షా.. గత ఏడాది జూలైలో శ్రీలంకపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. తరచుగా గాయాల బారిన పడటం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పృథ్వీ షా టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాతో పాటు పలువురు యంగ్ క్రికెటర్స్ రాణించడంతో టీమ్ఇండియాలో స్థానం కోసం గట్టి పోటీ ఏర్పడటం కూడా పృథ్వీషాకు ఇబ్బందికరంగా మారింది.
అయితే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో అతడిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా పృథ్వీషాను ఎంపిక చేయలేదు. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీలో పృథ్వీషా మంచి ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగిన అనధికారిక సిరీస్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు షా. అయినా తనను సెలెక్టర్లు పక్కనపెట్టడం నిరాశను కలిగించిందని పృథ్వీషా అన్నాడు.
ఆటగాడిగా హార్డ్ వర్క్ చేస్తున్న అవకాశాలు మాత్రం దక్కడం లేదని వాపోయాడు. బ్యాటర్లు పరుగులు చేయడం ముఖ్యమని, ఆ విషయంలో తాను ప్రతీసారి నిరూపించుకుంటూనే ఉన్నానని.. అయినా తనను పక్కనపెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సెలెక్లర్లకు తనపై నమ్మకం కలిగిన రోజే అవకాశం ఇస్తారన్నది అర్థమవుతోందని.. అప్పటివరకు శ్రమిస్తూనే ఉంటానని పృథ్వీ షా అన్నాడు.
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టిపెడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆటలో టెక్నిక్ మార్చుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పాడు. ఐపీఎల్ తర్వాత ఫామ్‌ను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపాడు. దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గానని చెప్పాడు.
అందుకోసం చైనీస్ కూడా మానేశా..
అయితే ఫిట్‌గా ఉండటం కోసం డైట్ ప్లాన్ మొత్తం మార్చుకున్నట్లు పృథ్వీషా తెలిపాడు. స్వీట్లు తినడం, కూల్‌డ్రింక్స్ తాగటం మానేశానని చెప్పాడు. ఇక ఇప్పుడు తన మెనూ నుంచి చైనీస్ ఫుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేశానన్నాడు. కచ్చితంగా టీమ్ఇండియాలో స్థానం సంపాదిస్తాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి: సామ్‌కు ధైర్యం చెబుతున్న నెటిజన్లు.. అందుకేనా?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'రెబల్' రీరిలీజ్.. ఎప్పుడంటే?