ETV Bharat / sports

'కివీస్​ కన్నా టీమ్​ఇండియానే బలంగా ఉంది' - డబ్ల్యూటీసీ ఫైనల్​ పార్ధివ్​ పటేల్​

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​, ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం ఎంపిక చేసిన జట్టు ఎంతో పటిష్ఠంగా ఉందని అన్నాడు భారత మాజీ క్రికెటర్​ పార్ధివ్​ పటేల్​. అన్ని విభాగాల్లో జట్టుకు సరిపడా బలమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు.

Parthiv Patel
పార్ధివ్
author img

By

Published : May 11, 2021, 4:53 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​, ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం ఎంపిక చేసిన జంబో టీమ్​ కివీస్​ కన్నా ఎంతో బలంగా ఉందని అన్నాడు భారత మాజీ వికెట్​కీపర్​, బ్యాట్స్​మన్​ పార్ధివ్​ పటేల్​. అన్ని విభాగాల్లో జట్టు సమతూకంగా ఉందని చెప్పాడు.

"జట్టు చాలా పటిష్ఠంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్​తో పోలిస్తే టీమ్​ఇండియా అన్ని విభాగాలను కవర్​ చేసింది. ఫాస్ట్​ బౌలర్లు బుమ్రా, ఇషాంత్​, షమీ వీరిలో ఎవరూ ఫిట్​గా లేకపోయినా వారికి ప్రత్యామ్నాయంగా మహ్మద్​ సిరాజ్​, ఉమేశ్​ యాదవ్​ ఉన్నారు. రోహిత్​శర్మ, శుభమన్​ గిల్​, కోహ్లీ, రహానె, పుజారా, పంత్​తో బ్యాటింగ్​ దళం బలంగా ఉంది. వీరంతా ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో అద్భుతంగా రాణించారు. ప్రతిఒక్కరు మంచి పరుగులు చేశారు. కేఎల్​ రాహుల్​ కూడా తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందంటే జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్​ సిరీస్​లో జడేజా స్థానంలో వచ్చి బాగా ఆడిన అక్షర్ పటేల్​ కూడా ఉన్నాడు. ఇప్పుడు జడేజాతో పాటు అశ్విన్​ కూడా వచ్చేశాడు. కాబట్టి జట్టు పటిష్ఠంగా ఉందనడంలో ఏ సందేహం లేదు" అని తెలిపాడు పార్థివ్.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ జూన్​ 18-22 వరకు, ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ ​ఆగస్టు4-సెప్టెంబరు 14 వరకు జరగనుంది. ఇందుకోసం టీమ్​ఇండియా జూన్​ 2న ఇంగ్లాండ్​కు బయలుదేరనుంది. అంతకుముందే మే 25నుంచి ఎనిమిది రోజుల పాటు బయోబబుల్​లో ఉండనుంది. అక్కడికి చేరుకున్నాక పదిరోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుంది.

ఇదీ చూడండి: డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.