ETV Bharat / sports

WTC Final: 'ఆ స్థానంలో నా ఓటు శార్దుల్​కే'

న్యూజిలాండ్​తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్​పై స్పందించాడు మాజీ సెలెక్టర్​ శరణ్​దీప్ సింగ్. నాలుగో సీమర్​ను తుది జట్టులోకి తీసుకోవాల్సి వస్తే తాను సిరాజ్​కు బదులు శార్దుల్​కు అవకాశం ఇస్తానని అభిప్రాయపడ్డాడు.

shardul thakur, sarandeep singh
శార్దుల్ ఠాకుర్​, శరణ్​దీప్ సింగ్
author img

By

Published : Jun 11, 2021, 3:22 PM IST

సౌథాంప్టన్​ వేదికగా జూన్​ 18 నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​పై స్పందించాడు మాజీ సెలెక్టర్​ శరణ్​దీప్​ సింగ్. భారత జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై పలు సూచనలు చేశాడు. నాలుగో సీమర్​ను జట్టులోకి తీసుకోవాల్సి వస్తే తాను మహమ్మద్ సిరాజ్​ను కాకుండా శార్దుల్​ ఠాకుర్​కు మద్దతిస్తానని తెలిపాడు. అలాంటప్పుడు రవీంద్ర జడేజా డగౌట్​కే పరిమితం కాక తప్పదని పేర్కొన్నాడు. కివీస్​ జట్టులో పలువురు లెఫ్ట్​ హ్యాండర్లు ఉన్న కారణంగా అశ్విన్​ టీమ్​లో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.

"ఇంగ్లాండ్​ పరిస్థితుల దృష్ట్యా సిరాజ్​తో పోల్చితే శార్దుల్​ జట్టులో ఉండటం మేలు. అతడు బంతి నుంచి స్వింగ్ రాబట్టగలడు. లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​గానూ పనికొస్తాడు. నేనైతే ఠాకుర్​కే మద్దతిస్తాను. ఇక ఇషాంత్ శర్మ, బుమ్రా, షమీ.. ఎలాగూ జట్టులో ఉంటారు. నాలుగో పేసర్​ను కనుక జట్టులో తీసుకోవాలంటే మాత్రం జడేజా డగౌట్​కే పరిమితమవుతాడు."

-శరణ్​దీప్ సింగ్, టీమ్ఇండియా మాజీ సెలెక్టర్​.

"యువ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ కూడా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలకం కానున్నాడు. రోహిత్​తో కలిసి శుభారంభాలు అందిస్తాడని ఆశిస్తున్నాను. స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో అంతగా రాణించని గిల్​.. కివీస్​తో ఫైనల్​లో ప్రముఖ పాత్ర పోషిస్తాడని భావిస్తున్నా" అని శరణ్​దీప్​ పేర్కొన్నాడు.

ఇక శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టుపై అభిప్రాయాన్ని వెల్లడించాడు శరణ్​దీప్. హర్దిక్​ స్థానంలో శివం దూబేను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపాడు.

ఇదీ చదవండి: Dravid: కోచ్​గా ప్రతీ క్రికెటర్​కు ఆడే అవకాశం ఇస్తా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.