ETV Bharat / sports

World Cup 2023 Records : ప్రపంచకప్​లో రికార్డుల మోత.. రికార్డుల రారాజు కెప్టెన్​ హిట్​మ్యానే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 5:57 PM IST

World Cup 2023 Records : ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ ఆరంభమై పది రోజులు గడిచింది. భారత్​ వేదికగా సక్సెస్​ఫుల్​గా జరుగుతున్న ఈ టోర్నీలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే ?

World Cup 2023 Records
World Cup 2023 Records

World Cup 2023 Records : భారత్​ వేదికగా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభమై పది రోజులు గడిచింది. ఇప్పటికి 12 మ్యాచ్‌లు మాత్రమే పూర్తయ్యాయి. అయితే ఆయా వేదికలపై రికార్డులు మాత్రం ఊహించని స్థాయిలో బద్దలవుతున్నాయి. తొలి మ్యాచ్​ నుంచి తాజా భారత్‌- పాక్‌ పోరు వరకూ దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ ఏదో ఒక కొత్త రికార్డు నమోదవూతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రపంచ కప్​ చరిత్రలో నమోదైన రికార్డులను ఓ సారి చూసేద్దామా..

  1. టోర్నీ తొలి మ్యాచ్‌లో 2019 ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో అప్పటి రన్నరప్‌ న్యూజిలాండ్‌ పోటీపడింది. 282/9 స్కోరుకే పరిమితమైనప్పటికీ ఆ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లందరూ రెండంకెల స్కోర్లు సాధించి చరిత్రకెక్కారు. ఇలా వన్డే హిస్టరీలో ఓ ఇన్నింగ్స్‌లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు చేయడం ఇదే తొలిసారి.
  2. ప్రపంచకప్‌ అరంగేట్రంలో శతకం సాధించిన అతి పిన్న వయస్సు (23 ఏళ్ల 321 రోజులు) ప్లేయర్​గా కివీస్​కు చెందిన రచిన్‌ రికార్డుకెక్కాడు. 82 బంతుల్లోనే సెంచరీ చేసిన అతను.. న్యూజిలాండ్‌ తరపున ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.
  3. శ్రీలంకపై చెలరేగిన దక్షిణాఫ్రికా కూడా తన ఖాతాలో పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఆ జట్టులో వాండర్‌డసెన్, డికాక్, మార్‌క్రమ్‌ సెంచరీలు బాదడం వల్ల ఆ జట్టు ఏకంగా 428/5 పరుగులు చేసింది. వరల్డ్​కప్​ చరిత్రలోనే ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో 2015లో అఫ్గానిస్థాన్‌పై 417/7 ఆస్ట్రేలియా చేసిన రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది.
  4. మెగా టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు నమోదవడం కూడా ఇదే తొలి సారి. 49 బంతుల్లోనే సెంచరీ అందుకున్న మార్‌క్రమ్‌.. ప్రపంచకప్‌ల్లో అత్యంత వేగవంతమైన శతకం రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత్​ ఖాతాలోనూ..
World Cup 2023 Team India : ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ మన భారత ప్లేయర్లు కూడా కొన్ని రికార్డులను నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ ఆడిన భారత్‌.. ఆ మ్యాచ్‌లో ఓ వద్దనుకున్న రికార్డును నమోదు చేసింది. ఓ వన్డే మ్యాచ్‌లో భారత టాప్‌-4 ఆటగాళ్లలో ముగ్గురు డకౌటవడం కూడా ఇదే తొలిసారి. ఇషాన్, రోహిత్, శ్రేయస్‌ సున్నాకే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

ఇదే మ్యాచ్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ వార్నర్‌.. ప్రపంచకప్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ (19)ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్, డివిలియర్స్‌ (20)ను వెనక్కినెట్టాడు. ఇక పేసర్‌ స్టార్క్‌ ప్రపంచకప్‌ల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (19)ల్లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

రికార్డుల రారాజు.. కెప్టెన్​ హిట్​మ్యాన్​

  1. ఇక అఫ్గాన్‌పై భారీ విజయాన్ని సాధించిన రోహిత్​ సేన.. ఈ గెలుపుతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్‌.. ప్రపంచకప్‌ల్లో అత్యధిక శతకాలు (7) చేసిన ఆటగాడిగా సచిన్‌ (6)రికార్డును బద్దలుకొట్టాడు.
  2. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్‌ గేల్‌ (553)నూ రోహిత్‌ అధిగమించాడు.
  3. ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ (63 బంతుల్లో) రికార్డునూ హిట్ మ్యాన్​ సొంతం చేసుకున్నాడు.
  4. ప్రపంచకప్‌ల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (19)లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వార్నర్‌ సరసన రోహిత్‌ నిలిచాడు.

ఇక పాక్‌తో మ్యాచ్‌తో వన్డేల్లో 300కు పైగా సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డుకెక్కాడు.

157 వికెట్లతో ప్రపంచ క్రికెట్​లో అత్యధిక వికెట్లు సాధించిన ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ ఘనత సాధించాడు.

ఉప్పల్​ వెరీ స్పెషల్..

  1. ఉప్పల్‌లో వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లోనూ రికార్డుల వెల్లువ కొనసాగింది. నెదర్లాండ్స్‌- న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ ఓ రికార్డును అందుకున్నాడు. ఉప్పల్‌ స్టేడియంలో వన్డేలో అయిదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
  2. ఇక ఇదే వేదికలో జరిగిన శ్రీలంక- పాక్‌ పోరులోనూ ఓ ప్రతిష్ఠాత్మక రికార్డు నమోదైంది. లంకపై పాక్‌ 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక ఛేదనగా నిలిచింది. 2011లో ఇంగ్లాండ్‌పై 328 పరుగుల ఛేదనతో ఐర్లాండ్‌ నెలకొల్పిన రికార్డును పాక్‌ తిరగరాసింది.
  3. ఈ మ్యాచ్‌లో శతకం చేసిన అబ్దుల్లా షఫీక్‌.. ప్రపంచకప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి పాక్‌ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇలా ఇప్పటికే ప్రపంచకప్​ వేదికగా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. రానున్న మ్యాచుల్లోనూ మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ind Vs Pak World Cup : రోహిత్​ టు రైనా.. భారత్-పాక్​ మ్యాచ్​ల్లో వీరు ఆడితే పరుగుల వరదే!

Ind vs Pak ODI World : భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ పోరు.. ఆ రికార్డులో సచిన్​దే జోరు.. రోహిత్-విరాట్ స్థానం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.