India Vs Netherlands World Cup 2023 : 2023 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడిన టీమ్ఇండియా 160 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో భారత్ ఎదురు లేకుండా సెమీస్‌కు చేరింది. మరోవైపు ఓటమి పాలైన నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తాము ఓడిపోయినా తల ఎత్తుకునే ఇంటికి వెళ్తున్నామని డచ్ క్రికెబోర్డు తెలిపింది. అంతే కాకుండా భారత్ బ్యాటింగ్ లైనప్‌ను అనేక తలలున్న రాక్షసుడిగా అభివర్ణించింది. భారత్‌ను గెలవడం చాలా కష్టం అని తెలిపింది.
'భారత్ బ్యాటింగ్ లైనప్, అనేక తలలున్న రాక్షసుడు'
టీమ్ఇండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు. భారత్ బ్యాటింగ్ లైనప్‌ను.. చాలా తలల ఉన్న రాక్షసుడిలా అభివర్ణించింది. ఒక స్టార్ బ్యాటర్ ఔట్ అయితే.. తదుపరి ఆటగాడు ఏం తక్కువ కాదని కొనియాడింది. కేవలం 21 ఓవర్లలో నాలుగో వికెట్‌కు.. శ్రేయస్ అయ్యర్ (128), కేఎల్ రాహుల్ (102).. 208 పరుగుల భాగస్వామ్యంతో ఈ విషయాన్ని నిరూపించారని మెచ్చుకుంది.
తల ఎత్తుకుని వెళ్లిపోతున్నాం!
ఆదివారం జరిగిన మ్యాచ్‌పై నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు స్పందించింది. 'డచ్ ప్లేయర్లు తమ చివరి ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ చేతిలో ఓడిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 410 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం డచ్ 250 పరుగులు చేసింది. ఇది డచ్ టీమ్‌కు ఒక పెద్ద నష్టం. కానీ ఇప్పటికే నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై చారిత్రాత్మక విజయాలతో తల ఎత్తుకుని టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది' అని ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది.
-
🟠The Dutch men have lost their last World Cup match. India made a whopping 410 runs. The Dutch made 250 runs in return. A big loss, but still the Netherlands can leave the tournament with their heads held high... Read the report: https://t.co/V4eTusGoFL #icc #kncbcricket pic.twitter.com/HwaV2xtOTL
— Cricket🏏Netherlands (@KNCBcricket) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🟠The Dutch men have lost their last World Cup match. India made a whopping 410 runs. The Dutch made 250 runs in return. A big loss, but still the Netherlands can leave the tournament with their heads held high... Read the report: https://t.co/V4eTusGoFL #icc #kncbcricket pic.twitter.com/HwaV2xtOTL
— Cricket🏏Netherlands (@KNCBcricket) November 12, 2023🟠The Dutch men have lost their last World Cup match. India made a whopping 410 runs. The Dutch made 250 runs in return. A big loss, but still the Netherlands can leave the tournament with their heads held high... Read the report: https://t.co/V4eTusGoFL #icc #kncbcricket pic.twitter.com/HwaV2xtOTL
— Cricket🏏Netherlands (@KNCBcricket) November 12, 2023
నెదర్లాండ్స్ ప్లేయర్ల భావోద్వేగం..!
ఆదివారం మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ రొలోఫ్ (Roelof van der Merwe)కు జెర్సీని కానుకగా ఇచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీని కౌగిలంచుకున్న రొలోఫ్.. భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో పాటు కొందరు నెదర్లాండ్స్ ప్లేయర్లు కూడా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ తన అధికారికి ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది.
మ్యాచ్ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడిన రొలోఫ్.. టీమ్ఇండియా చాలా శక్తిమంతమైన జట్టు అని అన్నాడు. 'భారత్ చాలా బ్యాలన్స్‌గా ఉంది. ఈ వరల్డ్ కప్‌లో వారు దానిని ప్రదర్శించారు. వారిని ఓడించడం చాలా కష్టం. మిగతా జట్లు కూడా బాగున్నాయి. సెమీ ఫైనల్‌పై చాలా ఆసక్తి ఉంది. కానీ ఇండియా సాధిస్తుందని నేను అనుకుంటున్నా' రొలోఫ్ అభిప్రాయపడ్డాడు.
బెన్‌స్టోక్స్‌కు చెన్నై గుడ్‌బై - 2024 ఐపీఎల్ ప్లేయర్ల రిలీజ్ లిస్ట్ ఇదే!
వికెట్లు తీసిన రోహిత్, కోహ్లీ- ఒకే మ్యాచ్‌లో 9 మంది బౌలింగ్, 31 ఏళ్ల తర్వాత రికార్డ్!