Cricketers Who Never Won World Cup : అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నాటి డాన్ బ్రాడ్‌మన్ నుంచి నేటి సచిన్ వరకు ఎంతో మంది లెజెండరీ ఆటగాళ్లు ఉన్నారు. వీరు తమ కెరీర్‌లో అటు వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు సాధించి, ఇటు జట్టుకూ విజయాలు అందిచండం ద్వారా ఆ స్థాయికి చేరుకున్నారు. అయితే.. చాలా మంది లెజెండ్లకు ఈ వరల్డ్ కప్ అనేది అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. అలాంటి ఒక 10 మంది లెజెండరీల గురించి తెలుసుకుందాం.
- గ్రాహం గూచ్
ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ దిగ్గజం.. సుదీర్ఘ కాలంగా ఆ జట్టు తరఫున ఆడాడు. 1976లో అరంగేట్రం చేసి.. 1995 లో రిటైర్ అయ్యాడు. తన కెరీర్‌లో 22,211 పరుగులు సాధించాడు. ఇంగ్లీష్ జట్టు తరఫున 3 ప్రపంచ కప్ టోర్నీ ఫైనళ్లలో ఆడాడు కానీ దాన్ని అందుకోలేకపోయాడు. 1992 వరల్డ్ కప్‌లో ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. - ఇయాన్ బోథమ్
అదే ఇంగ్లాండ్ దేశానికి చెందిన మరో లెజండరీ ప్లేయర్ ఇయాన్ బోథమ్. ఇతను ఆల్ రౌండర్. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఎన్నో రికార్డులు తిరగరాశాడు. ఇయాన్ మొత్తం రెండు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆడాడు. 1992 ప్రపంచ కప్‌లో 10 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టి తమ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. చివరికి దాన్ని ముద్దాడలేకపోయాడు. - వకార్ యూనిస్
పాక్ దిగ్గజం వకార్ యూనిస్.. ప్రపంచ సూపర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. పాత బంతితో అద్భుతంగా రివర్స్ స్వింగ్ చేయగల సమర్థుడు. ఎన్నో సార్లు 5, అంతకంటే ఎక్కువ సార్లు వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కానీ.. ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఎందుకంటే 1992 వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్ టీమ్‌లో అతను లేడు. ఆ తర్వాత 1999 లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఆడాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమిపాలైంది. - సౌరవ్ గంగూలీ
పశ్చిమ బంగా టైగర్, ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 1999-2007 మధ్య 3 ప్రపంచ కప్పుల్లో పాల్గొన్నాడు. 2003 లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ టోర్నీలో మూడు సెంచరీలు కొట్టాడు. అన్ని సవాళ్లు ఎదుర్కొని టీమ్ఇండియాను ఫైనల్ చేర్చినా.. విజయం సాధించలేకపోయాడు. ఏదేమైనప్పటికీ.. మన జట్టు ప్రస్తుతం దూకుడుగా ఆడుతూ.. అగ్రస్థానంలో ఉందంటే అందులో దాదా పాత్ర ఎంతో ఉంది. - బ్రియాన్ లారా
టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు బ్రియన్ లారా. వెస్టిండీస్ టీమ్ లెజండరీ అయిన ఇతను.. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన అతికొద్ది ఆటగాళ్లలో లారా ఒకడు. వన్డేల్లో మూడు సార్లు 150 కి పైగా పరుగులు కొట్టాడు. వెస్టిండీస్ తరఫున 299 వన్డేలు ఆడినా లారాకు... ప్రపంచ కప్‌ను ఒడిసిపట్టే అవకాశం రాలేదు. - లాన్స్ క్లూసెనర్
లాన్స్ క్లూసెనర్ అంతర్జాతీయ క్రికెట్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. తన బ్యాటింగ్ తీరు, ఫాస్ట్-మీడియం స్వింగ్ బౌలింగ్‌కు ప్రసిద్ధి. 1990, 2000 సంవత్సరాల ప్రారంభంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. తన భారీ హిట్టింగ్, వినూత్న బౌలింగ్‌తో 2000లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 1999 వరల్డ్ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ వరకు వెళ్లి.. అందులో పరాజయం పాలవడం వల్ల క్లూసెనర్కి కప్పును ముద్దాడే అవకాశం రాలేదు. - జాక్వెస్ కల్లిస్
లాన్స్ క్లూసెనర్ తర్వాత దక్షిణాఫ్రికా గొప్ప ఆల్ రౌండర్ గా జాక్వెస్ కలిస్ అని చెబుతారు. టెస్టులు, వన్డే ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా జట్టుకు కలిస్ చేసిన సేవ గొప్పది. రెండు వన్డే ఫార్మాట్లో 10 వేల కంటే ఎక్కువ పరుగులు చేసి 250 వికెట్లు తీసిన ఏకైక ఆల్ రౌండర్. తన కెరీర్‌లో 17 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇంత చేసినా.. వరల్డ్ కప్ కలిస్ కు ఒక కల గానే మిగిలిపోయింది. - కుమార సంగక్కర
శ్రీలంకన్ మాజీ క్రికెటర్ కుమార సంగక్కర.. తన జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. వికెట్ కీపింగ్‌లో తనదైన మార్కు చూపిస్తూ.. బ్యాటర్ గా అనేక శతకాలు నమోదు చేశాడు. ఇతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసే సమయానికి సచిన్ మాత్రమే అతని కంటే ఎక్కువ వన్డే పరుగులు చేశాడు. 2015 ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు. అంతకు ముందు 2007, 2011 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడినా.. శ్రీలంక టీమ్ విజయం సాధించలేకపోయింది. - ఏబీ డివిలియర్స్
మిస్టర్ 360 గా పేరొందిన ఏబీ డివిలియర్స్.. తన వినూత్నమైన షాట్లతో ప్రేక్షకులను మెప్పించగలడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ అయిన ఏబీ.. ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (31 బంతుల్లో) చేసిన రికార్డు ఇతని పేరుమీదే ఉంది. కానీ వరల్డ్ కప్ అందుకోవాలన్న ఈ లెజెండరీ క్రికెటర్ ఆశ అలాగే మిగిలిపోయింది. - షాహిద్ ఆఫ్రిది
పాకిస్థాన్ ఆల్ రౌండర్ అయన షాహిద్ ఆఫ్రిది.. అటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, స్పిన్నర్ గా సేవలదించాడు. అంతేకాకుండా.. భారీ షాట్లతో సిక్సులకు పెట్టింది పేరు. 1996 లో వన్డేలో అతను 37 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆ రికార్డు చాలా కాలం పాటు అలాగే ఉంది. ఇలా తన టీమ్‌కి ఎన్నో రికార్డులు, విజయాలు సాధించి పెట్టిన ఆఫ్రిదికి.. వరల్డ్ కప్ ఒక అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది.
Rohit Sharma World Cup 2023 : మెగా సమరంలో రోహిత్ రికార్డులు.. హిట్‌మ్యాన్ విధ్వంసానికి కారణమిదే!
India vs Pakistan World Cup : మహా సమరానికి మరో 24 గంటలే.. మెగాటోర్నీలో దాయాదిపై 'భారత్'దే పైచేయి