ICC World Cup Sponsors List : ఐసీసీ వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానున్న వేళ.. ఈ టోర్నీలోని మ్యాచ్‌లను స్పాన్సర్ చేసేందుకు పెద్ద పెద్ద కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు డిస్నీ స్టార్ స్పోర్ట్స్ విభాగం హెడ్ సంజోగ్ గుప్తా పేర్కొన్నారు. వీటిలో చాలా స్పాన్సర్లు టీవీ, డిజిటల్ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు మాత్రం కేవలం డిజిటల్ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు 48 మ్యాచ్‌లను డిస్నీ సంస్థ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారం చేయనుంది. తొమ్మిది భాషల్లో 100 పైగా కామెంటేటర్స్‌తో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. ఆసియా కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో పాటు పండుగ సీజన్.. ఈ రెండూ వరల్డ్ కప్‌పై భారీ అంచనాలు పెంచాయి. దీని కారణంగా అడ్వరై్టజర్లు కూడా స్పాన్సర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా వెల్లడించారు.
స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్‌పే, హావెల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్11, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, పీటర్ ఇంగ్లాండ్, ఎంఆర్‌ఎఫ్, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, గూగుల్ పే, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, లెండింగ్‌కార్ట్, బుకింగ్‌డాట్‌కామ్, యాంఫీ, హెర్బాలైఫ్, హయర్, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలున్నాయని గుప్తా తెలిపారు. కోకా–కోలా, బీపీసీఎల్, ఫోన్‌పే, హెచ్‌యూఎల్ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్పాన్సర్ చేస్తున్నాయని ఆయన అన్నారు.
"అడ్వర్టైజర్స్ బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పుకొచ్చారు. పండుగ సీజన్ సందర్భంగా.. ఏవరైనా అడ్వర్టైజర్ దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో సంస్థలు.. పండుగకి ముందు ఓ రెండు వారాల పాటు యాడ్స్ ఇవ్వాలని అనుకుంటే.. వారు కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ అడ్వర్టైజ్మెంట్స్ ప్రసారం చేసుకునేందుకు ఓ కస్టమైజ్డ్ ప్యాకేజీని అందిస్తున్నాం. 'సెల్ఫ్–సర్వ్ ఫ్రేమ్‌వర్క్' ద్వారా ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్ టీమ్స్ జోక్యం లేకుండా సంస్థలు తమ అవసరమైన వాటిని స్వయంగా బుక్ చేసుకునే వీలును కల్పించాం" అని గుప్త పేర్కొన్నారు.
Rohit sharma Virat Kohli : 2011 టు 2023.. ఈ జట్టులోనూ ఆ ఇద్దరూ కీలకమే!
ODI World Cup 2023 : 'టీమ్ఇండియాకు ఆ సత్తా ఉంది.. అతడు అద్భుతం చేస్తాడు'