ETV Bharat / sports

ICC World Cup 2023 : 9 మ్యాచులు రీషెడ్యూల్​.. భారత్-పాక్ మ్యాచ్​ డేట్ ఫిక్స్​ - IND VS PAK match

ICC World Cup 2023 IND VS PAK Match Date : భారత్​ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్​ 2023 షెడ్యూల్​లో మార్పులు చేసింది ఐసీసీ. భారత్​- పాకిస్థాన్​ మధ్య జరగనున్న మ్యాచ్​ తేదీని ప్రకటించింది.

ICC World Cup 2023 భారత్ పాక్ మ్యాచ్​
ICC World Cup 2023
author img

By

Published : Aug 9, 2023, 5:29 PM IST

Updated : Aug 9, 2023, 6:15 PM IST

ICC World Cup 2023 IND VS PAK Match Date : క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్​ కప్​కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్​లో మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మొత్తం 9 మ్యాచ్​లు రీషెడ్యూల్​ చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా అక్టోబర్​ 15వ తేదీన.. అహ్మదాబాద్​లో జరగాల్సిన భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్(IND VS PAK match)​.. ఒకరోజు(అక్టోబరు 14వ తేదీ) ముందే జరగనుందని పేర్కొంది.

  • అక్టోబర్​ 14న దిల్లీ వేదికగా జరగాల్సిన ఇంగ్లాండ్-అప్ఘానిస్తాన్​ మ్యాచ్​ అక్టోబర్​ 15న నిర్వహించబోతున్నట్లు తెలిపింది.
  • అక్టోబర్​ 12న హైదరాబాద్​ వేదికగా శ్రీలంక-పాకిస్థాన్​ మధ్య జరగాల్సిన మ్యాచ్​ అక్టోబర్ 10న నిర్వహించనున్నారు.
  • అక్టోబర్ 13 శుక్రవారం లఖ్​నవూ వేదికగా నిర్వహించాల్సిన ఆస్ట్రైలియా-సౌతాఫ్రికా మ్యాచ్​ను అక్టోబర్ 12న జరగనుంది.
  • అక్టోబర్ 14న చెన్నై వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్​-బంగ్లాదేశ్ మ్యాచ్​.. అక్టోబర్ 13న డే అండ్ నైట్​ కంటెస్ట్​గా నిర్వహించనున్నారు.
  • ధర్మశాల వేదికగా నవంబర్‌ 11న ఇంగ్లాండ్​-బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌.. అదే రోజు నవంబర్‌ 11 డే మ్యాచ్‌ (10:30)గా నిర్వహించనున్నారు.
  • పుణె వేదికగా నవంబర్ 12న జరగాల్సిన ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్​ మధ్య నవంబర్‌ 11న ఉదయం 10.30 గంటలకు జరగనుంది.
  • కోల్‌కతా వేదికగా నవంబర్‌ 12న జరగాల్సిన ఇంగ్లాండ్-పాకిస్థాన్​ మ్యాచ్ నవంబర్‌ 11న మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది.
  • బెంగళూరు వేదికగా టీమ్​ఇండియా లాస్ట్ లీగ్​ గేమ్​.. నవంబర్‌ 11 నుంచి నవంబర్‌ 12వ తేదీకి మారింది. ఇందులో భారత్.. నెదర్లాండ్స్​తో తలపడనుంది.

ICC World Cup 2023 First Match Venue : భారత్‌ వేదికగా ఈ వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది. ఈ మెగా సమరం అక్టోబర్‌ 5న ప్రారంభమై నవంబర్‌ 19న ముగియనుంది. ఈ టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లాండ్​.. రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది.

Pakistan ODI World Cup 2023 : పాక్​కు లైన్​ క్లియర్​.. వన్డే వరల్డ్ కప్​ కోసం భారత్​కు..

ICC World Cup 2023 : భారత్- పాక్ మ్యాచ్ హైప్​ పీక్స్.. ఆస్పత్రులనూ వదలట్లేదుగా!

'జైషా సారూ.. భారత్​- పాక్​ మ్యాచ్ డేట్​ మార్చేశారు.. మా 'కాస్ట్లీ రూమ్​'ల పరిస్థితేంటి!?'

Last Updated : Aug 9, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.