ఐసీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పూర్తయింది. భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. అయితే గత ఏడేళ్లలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో ప్రతిసారి కొత్త జట్టు విజేతగా నిలిచింది. దాదాపు ఏడు టోర్నీల్లో ఏడు జట్లు ట్రోఫీని ముద్దాడాయి. ఇంతకీ ఆ జట్లేంటి? ఆ కప్‌లు ఏంటి?
2013 ఛాంపియన్స్ ట్రోఫీ- టీమ్ఇండియా
ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో ధోనీ కెప్టెన్సీలో భారత్ విజేతగా నిలిచింది. ఇంగ్లీష్ జట్టుతో పోటీపడిన ఈ మ్యాచ్‌లోనూ వర్షం ఆటంకం కలిగించింది. కానీ టీమ్ఇండియా సమష్టి ప్రదర్శన చేసి కప్పు అందుకుంది.
![CHAMPIONS TROPHY 2013](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12244653_icc-3.jpg)
2014 టీ20 ప్రపంచకప్-శ్రీలంక
ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌తో తలపడిన శ్రీలంక విజేతగా నిలిచింది. ధోనీసేన నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది.
![t20 world cup srilanka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12244653_icc-6.jpg)
2015 వన్డే ప్రపంచకప్-ఆస్ట్రేలియా
స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి సగర్వంగా కప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
![ODI WORLD CUP 2015 AUSTRALIA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12244653_icc-7.jpg)
2016 టీ20 ప్రపంచకప్- వెస్టిండీస్
భారత్‌లో జరిగిన ఈ టోర్నీ తుదిపోరులో ఇంగ్లాండ్-వెస్టిండీస్ తలపడ్డాయి. ఛేదనలో చివరి ఓవర్లో నాలుగు సిక్సులు కొట్టిన కరీబియన్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్.. తమ జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
![2016 t20 world cup west indies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12244653_icc-2.jpg)
2017 ఛాంపియన్స్ ట్రోఫీ-పాకిస్థాన్
ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ కప్ కోసం తలపడ్డాయి. అయితే అన్ని మ్యాచ్‌ల్లో నిలకడగా ఆడిన కోహ్లీసేన.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో పాక్, 180 పరుగుల భారీ తేడాతో గెలిచి, విజేతగా నిలిచింది.
![2017 champions trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12244653_icc-4.jpg)
2019 వన్డే ప్రపంచకప్-ఇంగ్లాండ్
స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో తలపడింది. సూపర్ ఓవర్ కూడా టై అయిన ఈ మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లీష్ జట్టును విజేతగా నిలిచింది.
![2019 WORLD CUP ENGLAND](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12244653_icc-1.jpg)
2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్- న్యూజిలాండ్
ఐసీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి నిర్వహించిన ఈ టెస్టు టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. టీమ్ఇండియాను ఓడించి, కప్‌ను సొంతం చేసుకుంది.
![new zealand wtc trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12244653_icc-5.jpg)
ఇవీ చదవండి: