ETV Bharat / sports

ICC Test Rankings: కోహ్లీ కాస్త పైకి.. పంత్, బుమ్రా దూకుడు - Pant test ranking

ICC Test Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. పంత్, బుమ్రా కూడా తమ ర్యాంకుల్లో ముందుకు జరిగారు.

ICC Test Rankings
ICC Test Rankings
author img

By

Published : Jan 19, 2022, 3:34 PM IST

ICC Test Rankings: ఐసీసీ కొత్త టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో టీమ్​ ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి.. ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 79, 29 పరుగులతో రాణించడం వల్ల విరాట్​ ర్యాంకు మెరుగుపడింది.

అదే టెస్టులో సెంచరీతో రాణించిన రిషభ్​ పంత్​ 10 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకోగా.. రోహిత్​ శర్మ ఓ స్థానం దిగజారి ఆరుకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్​ ట్రావిస్​ హెడ్​ కెరీర్​లోనే అత్యుత్తుమ ర్యాంకును అందుకున్నాడు. ఐదో స్థానంలో నిలిచాడు.

బౌలింగ్​ విభాగంలో టీమ్​ఇండియా పేసర్​ బుమ్రా తన ర్యాంకును మెరుగుపరుచుకుని తిరిగి టాప్​ 10లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కామెరూన్ గ్రీన్.. 23 స్థానాలు ముందుకు జరిగి 66వ ర్యాంకులో నిలిచాడు. కాగా, ఇతడు బౌలింగ్​ విభాగంలో 13 స్థానాలు ఎగబాకి 62కు చేరుకున్నాడు.

ఇదీ చూడండి: బోపన్న జోడీ ఓటమి.. తొలి రౌండ్​లోనే సానియా మీర్జా జంట ఔట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.