ETV Bharat / sports

ICC Test rankings: అగ్రస్థానానికి దూసుకెళ్లిన అశ్విన్​ - ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ అండర్సన్​

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్​లో భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆ వివరాలు..

ICC Test rankings
అగ్రస్థానానికి దూసుకెళ్లిన అశ్విన్​
author img

By

Published : Mar 1, 2023, 3:02 PM IST

Updated : Mar 1, 2023, 3:24 PM IST

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్​ఇండియా ఆటగాళ్లు జోరు కొనసాగిస్తున్నారు. తాజా ర్యాంకింగ్స్​లో భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లతో రాణించిన అశ్విన్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకున్నాడు. 864 పాయింట్లతో టాప్‌ ర్యాంకుకు ఎగబాకాడు. 2015 తర్వాత టెస్టు బౌలర్స్‌ ర్యాంకింగ్స్‌లో అశ్విన్​ అగ్రస్థానానికి చేరడం ఇది రెండోసారి.

రీసెంట్​గా న్యూజిలాండ్‌- ఇంగ్లాండ్​ మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లీష్​ ప్లేయర్​ జేమ్స్ అండర్సన్‌ పెద్దగా మంచి ప్రదర్శన చేయకపోవడం.. రవిచంద్రన్ అశ్విన్‌కు బాగా కలిసి వచ్చినట్టైంది. ఈ మ్యాచ్​లో ఇంగ్లీష్ జట్టు ఓడిపోయిన నేపథ్యంలో గత వారం నెం.1 టెస్టు బౌలర్​గా అవతరించిన ఆండర్సన్‌ తన పాయింట్లు కోల్పోయి.. ఇప్పుడు రెండో ర్యాంకుకు పడిపోయాడు.

అప్పుడు రెండో ర్యాంకులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్​కు.. టాప్‌లో ఉన్న జేమ్స్ అండర్సన్‌కు మధ్య రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్​తో రెండో టెస్టు మ్యాచ్​ ముగిశాక.. అండర్సన్​ ర్యాంకు కిందకి పడిపోవడం.. అశ్విన్​ టాప్​లోకి రావడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరి మధ్య 5 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో.. అశ్విన్ తన జోరును కొనసాగిస్తే మరికొంత కాలం అతడు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్లీ రెండు లేదా మూడో స్థానాల్లోకి పడిపోయే ఛాన్స్ ఉంది.

ఇక మూడో స్థానంలో పాట్​ కమ్మిన్స్ కొనసాగుతుండగా.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి గాయంతో దూరమైన బుమ్రా మాత్రం ఓ ర్యాంకును మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. షాహీన్ ఆఫ్రిదీ ఐదో స్థానంలో నిలిచాడు. ఇకపోతే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోనే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పది వికెట్లతో సత్తాచాటిన రవీంద్ర జడేజా.. ఈ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి చేరాడు.

బ్యాటర్ల విభాగంలో.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో శతకంతో అదరగొట్టిన జో రూట్.. ముడో స్థానానికి ఎగబాకాడు. మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. బాబర్ ఆజమ్ నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఇకపోతే గత వారం ఆరో స్థానంలో ఉన్న రిషబ్ పంత్ 8వ ర్యాంకుకు, ఏడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ తొమ్మిదో ర్యాంకుకు పడిపోయారు.

అలానే ఆల్​రౌండర్ల జాబితాలో.. రవీంద్ర జడేజా 460 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంకులో ఉన్నాడు. అక్షర్ పటేల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి: IND Vs AUS: మూడో టెస్ట్​లో చేతులెత్తేసిన టీమ్​ఇండియా బ్యాటర్లు.. 33 ఓవర్లకే​ ఆలౌట్​!

Last Updated : Mar 1, 2023, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.