ICC Test Ranking: టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం విరాట్ 761 రేటింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10లో విరాట్ ఒక్కడే ఉండడం గమనార్హం. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 4 స్థానాలు దిగజారి 14వ ప్లేస్‌కు పడిపోయాడు. ఇక స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (508 రేటింగ్స్) ఏకంగా 11 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కాగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (864 రేటింగ్స్) టాప్‌లో ఉండగా, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (859 రేటింగ్స్)తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 872 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 854 రేటింగ్స్‌తో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమ్ఇండియా బౌలర్లు రవీంద్ర జడేజా (774 రేటింగ్స్), జస్ప్రీత్ బుమ్రా (767 రేటింగ్స్)తో నాలుగు, ఐదు ప్లేస్‌లు దక్కించుకున్నారు.
ICC Men’s Emerging Cricketer of the Year 2023: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్, ఐసీసీ 2023 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ బుధవారం రివీల్ చేసిన ఈ లిస్ట్‌లో జైశ్వాల్‌తో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా బౌలర్ కోట్జీ గెరాల్డ్, శ్రీలంక స్పిన్నర్ దిల్షాన్ మధుషంక ఉన్నారు.
-
Presenting the nominees for the annual ICC Awards 2023 🤩
— ICC (@ICC) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Starting with the first category, the ICC Men’s Emerging Cricketer of the Year 👇#ICCAwards
">Presenting the nominees for the annual ICC Awards 2023 🤩
— ICC (@ICC) January 3, 2024
Starting with the first category, the ICC Men’s Emerging Cricketer of the Year 👇#ICCAwardsPresenting the nominees for the annual ICC Awards 2023 🤩
— ICC (@ICC) January 3, 2024
Starting with the first category, the ICC Men’s Emerging Cricketer of the Year 👇#ICCAwards
Yashaswi Jaiswal International Career: ఈ ఏడాది అంతర్జాతీయ టెస్టు, టీ20 ఫార్మాట్లో అరంగేట్ర చేసిన జైశ్వాల్ అదరగొట్టాడు. వెస్టిండీస్‌పై ఆడిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే 171 పరుగులు చేసి ఔరా అనిపించాడు. మొత్తం 6 టెస్టు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 288 పరుగులు చేశాడు. ఆ తర్వాత టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్ ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడాడు. 33.08 సగటుతో 430 పరుగులు నమోదు చేశాడు. కాగా, 15 మ్యాచ్‌ల్లోనే జైశ్వాల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
అలా జరిగితే ధోనీ తర్వాత రెండో కెప్టెన్‌గా రోహిత్- ఏం అవుతుందో మరి?
రెండో టెస్ట్.. యశస్వి, కోహ్లీ, రోహిత్ రికార్డులే రికార్డులు.. హైలెట్స్ చూశారా?