ETV Bharat / sports

టీ20 ర్యాంకింగ్స్​: రెండో ర్యాంకులో బాబర్​.. కోహ్లీ@5 - కెప్టెన్​ విరాట్​ కోహ్లీ

ఇటీవలే విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో సత్తా చాటిన పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​.. టీ20 ర్యాంకుల్లోనూ మెరుగయ్యాడు. బ్యాటింగ్​ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Apr 21, 2021, 4:11 PM IST

టీ20 క్రికెట్​ ర్యాంకింగ్స్​ను బుధవారం అంతర్జాతీయ క్రికెట్​ కమిటీ(ఐసీసీ) విడుదల చేసింది. బ్యాట్స్​మన్​ జాబితాలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. మరో భారత బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​ ఏడో స్థానంలో ఉన్నాడు.

బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లోని అగ్రస్థానంలో ఇంగ్లాండ్​కు చెందిన డేవిడ్​ మలన్​ (892 పాయింట్లు) నిలిచాడు. ఇటీవలే విడుదల చేసిన వన్డే​ ర్యాంకింగ్స్​లో భారత కెప్టెన్ కోహ్లీని అధిగమించిన పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​.. టీ20 ర్యాంకింగ్స్​లో మెరుగై, ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​ను వెనక్కినెట్టాడు బాబర్​.

మరోవైపు పాకిస్థాన్​ బ్యాట్స్​మెన్ మహ్మద్​ రిజ్వాన్​ (15వ ర్యాంకు),​ ఫకార్​ జమాన్​ (33వ ర్యాంకు) మెరుగవ్వగా.. బౌలర్ల ర్యాంకింగ్స్​లో పాక్​ బౌలర్లు​ షాహీన్ అఫ్రిదీ (11వ ర్యాంకు), ఫహీమ్​ అష్రాఫ్​ (16వ ర్యాంకు), మహ్మద్​ నవాజ్​ (24వ ర్యాంకు), హారిస్​ రౌఫ్​ (38వ ర్యాంకు) మెరుగయ్యారు.

ఇవీ చదవండి: కెప్టెన్ కోహ్లీ పేరుతో సర్క్యులర్

బాధ్యతతో జాగ్రత్తగా ఉండండి: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.