టీ20 ప్రపంచకప్ (T20 World Cup)కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సాన్ మణి(Ehsan Mani). పొట్టి వరల్డ్కప్ భారత్ కాకుండా యూఏఈ(UAE) వేదికగా జరుగుతుందని తెలిపారు. కొవిడ్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్ వాయిదా పడిందని.. మిగతా మ్యాచ్లు కూడా యూఏఈకే తరలి వెళ్లాయని పేర్కొన్నారు.
"ఐపీఎల్ రెండో దశతో పాటు టీ20 ప్రపంచకప్ యూఏఈలో జరుగుతుంది. ఇందుకోసం మేము పీఎస్ఎల్ను రద్దు చేయడం లేదా ప్రత్యామ్నాయ వేదిక కోసం చూడటం తప్ప మరో మార్గం లేదు. ప్రస్తుత కొవిడ్ సమయంలో మ్యాచ్ల నిర్వహణ చాలా కష్టం. అన్ని క్రికెట్ బోర్డులు సర్దుబాట్లు చేసుకుంటున్నాయి. మేము కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. మా ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం."
-ఎహ్సాన్ మణి, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్.
భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ నిర్వహించే విషయమై తేల్చడానికి.. ఐసీసీ జూన్ 28 వరకు బీసీసీఐకి సమయాన్ని ఇచ్చింది.