ఇటీవలే ఐపీఎల్ ఆనందాన్ని ఆస్వాదించిన క్రీడాభిమానులు.. మరికొద్ది రోజుల్లో ప్రారంభంకాబోయే టీ20 ప్రపంచకప్(T20 world cup 2021 schedule) అసలు పోటీల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని జట్ల మధ్య మ్యాచ్ జరిగినా.. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్(team india pakistan cricket match) మధ్య జరిగే పోరంటే ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో పోటీ పడిన ఈ రెండు జట్లు మళ్లీ (pak india match 2021) ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగబోతున్నాయి. ఈ నెల 24న ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఒకరినొకరితో తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో(pak vs india match schedule) ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి.. శుభారంభం చేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ సందర్భంగా గతంలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితాలపై ఓ లుక్కేద్దాం..
భారత్‌దే పై చేయి
ఈ మెగాటోర్నీ(pakistan india match t20 world cup) చరిత్రలో భారత్, పాక్ ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడగా అన్నింటిలోనూ టీమ్‌ఇండియానే విజయం సాధించింది. 50 ఓవర్ల వరల్డ్ కప్‌లోనూ ఏడు సార్లు తలపడగా పాకిస్థాన్ ఇప్పటివరకు భారత జట్టును ఓడించలేదు.
టీ20 ప్రపంచకప్(pak vs india match 2021)
- 2007 టీ20 ప్రపంచకప్- గ్రూప్ మ్యాచ్-భారత్ విజయం
- 2007 టీ20 ప్రపంచకప్-ఫైనల్ మ్యాచ్-5 పరుగులు తేడాతో భారత్ విజయం
- 2012 టీ20 ప్రపంచకప్- సూపర్ 8- 8 వికెట్ల తేడాతో భారత్ విజయం
- 2014 టీ20 ప్రపంచకప్- సూపర్ 10- 7 వికెట్ల తేడాతో భారత్ విజయం
- 2016 టీ20 ప్రపంచకప్- సూపర్10- 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
భారతే ఫేవరెట్
ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగుతుండగా.. పాకిస్థాన్ కూడా బలంగానే కనిపిస్తోంది. యూఏఈ, ఒమన్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతుండటం పాకిస్థాన్‌కు కలిసి వచ్చే విషయం. కాబట్టి ఆ జట్టు కూడా గట్టి పోటీ నిచ్చే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్ షురూ.. ఇవి తెలుసుకోండి..