టీ20 ప్రపంచకప్(T20 Worldcup 2021 news) ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియంలో పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని యూఏఈ ప్రభుత్వాన్ని కోరాయి బీసీసీఐ(bcci news), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ECB news). ప్రపంచకప్ ఫైనల్(t20 world cup 2021 venue) వంటి మ్యాచ్‌కు ప్రేక్షకుల మద్దతు చాలా అవసరమని బోర్డులు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న దుబాయ్ వేదికగా జరగనుంది.
"ప్రపంచకప్ ఫైనల్(t20 world cup 2021 venue) మ్యాచ్ కోసం మైదానంలో పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులు ఉండాలని అనుకుంటున్నాం. ప్రొటోకాల్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై ప్రభుత్వాన్ని అనుమతి కోరాం. ఒకవేళ ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తే మైదానంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫైనల్ జరుగుతుంది. ప్రభుత్వం స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021(t20 world cup 2021 venue) జరుగుతోంది. ఈ మ్యాచ్‌లకు 50 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులకు అనుమతినిచ్చారు. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లకు మూడు మైదానాల్లో విభిన్న నిబంధనలు ఉన్నాయి.
- దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరుకావాలంటే వ్యాక్సినేషన్ పూర్తయినట్లు సర్టిఫికేట్ చూపించాలి.
- షార్జా విషయానికి వస్తే 16 ఏళ్లు దాటిన వారే మ్యాచ్‌లకు హాజరుకావాలి. వీరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌తో పాటు 48 గంటల ముందు చేసుకున్న పీసీఆర్ టెస్టు ఫలితాన్ని చూపించాలి.
- అబుదాబిలో మ్యాచ్‌లకు 16 ఏళ్ల తక్కువ వయసు వారు హాజరుకావచ్చు. కానీ 12-15 ఏళ్ల వయసు వారు పీసీఆర్ టెస్టు ఫలితాన్ని చూపించాలి. 16 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌తో పాటు పీసీఆర్ టెస్టు ఫలితం వెంట తీసుకురావాలి.
కరోనా కారణంగా భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 venue)ను యూఏఈలో నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ టోర్నీ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో ఆడనుంది భారత్.