ETV Bharat / sports

మళ్లీ అదరగొట్టేసిన కోహ్లీ.. ఈ సారి ఎందులో అంటే - ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​ కోహ్లీ

సెంచరీ బాది జోష్​లో ఉన్న టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ.. మళ్లీ ఆ విషయంలో తన సత్తా చాటాడు. ఎందులో అంటే?

ICC T20 Rankings Kohli
కోహ్లీ టీ20 ర్యాంకిగ్స్​
author img

By

Published : Sep 14, 2022, 4:40 PM IST

ఆసియాకప్​ 2022లో భాగంగా అప్ఘానిస్థాన్​పై జరిగిన మ్యాచ్​లో సెంచరీ బాది తిరిగి ఫామ్​లోకి వచ్చిన టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో అదరగొట్టాడు. టాప్‌-10 దిశగా దూసుకొస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1020 రోజుల తర్వాత శతకం బాదిన విరాట్‌.. గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇదే జోరును త్వరలో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ల్లోనూ(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) కొనసాగిస్తే తిరిగి అగ్రపీఠాన్ని చేరుకోవడం ఖాయం.

ఇక టీమ్​ఇండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆసియా కప్‌లో దారుణంగా విఫలమైన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. పాక్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సఫారీ బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్​క్రమ్​ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ హీరో, శ్రీలంక బ్యాటర్‌ భానుక రాజపక్ష.. 34 స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్థానానికి చేరుకోగా.. టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక బౌలర్ల విభాగంలో.. ఆసియా కప్‌లో ఆప్ఘానిస్థాన్​పై సంచలన ప్రదర్శన (5/4) చేసిన టీమ్​ఇండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. భువీ.. 11వ స్థానం నుంచి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. టీమ్​ఇండియా నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక బౌలర్‌ భువీ ఒక్కడే కావడం విశేషం. ఈ జాబితాలో ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సఫారీ స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంషి, ఇంగ్లాండ్​ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆసియా కప్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ విన్నర్‌ వనిందు హసరంగ తొమ్మిదో స్థానం​ నుంచి ఆరో ప్లేస్‌కు ముందుకెళ్లాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాతో సిరీస్​.. ఆసీస్​కు భారీ షాక్​.. ముగ్గురు కీలక ప్లేయర్స్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.