ETV Bharat / sports

క్రికెట్​లో మరో కొత్త రూల్!​- శ్రీలంక నుంచి అండర్​ 19 వరల్డ్ కప్ ఔట్​- కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ - పిచ్​ బ్యాన్​ ప్రక్రియలో మార్పు

ICC stop clock Rule For Bowlers : క్రికెట్​లో కొత్త రూల్​​ తీసుకొచ్చింది ఇంటర్​నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ. అదేంటంటే?

ICC stop clock Rule For Bowlers
ICC stop clock Rule For Bowlers
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 6:01 PM IST

Updated : Nov 21, 2023, 7:30 PM IST

ICC stop clock Rule For Bowlers : ఇంటర్​నేషనల్ క్రికెట్ కౌన్సిల్​- ఐసీసీ కొత్త రూల్​​ తీసుకొచ్చింది. బౌలర్​ ఒక ఇన్నింగ్స్​లో బౌలింగ్​ చేయడానికి విధించిన 60 సెకన్ల పరిమితిని మూడోసారి దాటితే.. 5 పరుగుల పెనాల్టీ విధిస్తామని ప్రకటించింది. అయితే ఈ 'స్టాప్​ క్లాక్​' నియమాన్ని 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్​ వరకు పురుషుల వన్డే, టీ20 మ్యాచ్​ల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఐసీసీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఓవర్​ల మధ్యలో తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

అండర్​ 19 వరల్డ్​ వేదిక మార్పు..
Under 19 World Cup 2024 Venue : మరోవైపు.. శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్​ చేసిన కారణంగా.. ఆ దేశంలో జరగాల్సిన అండర్​ 19 వరల్డ్​ కప్​ను.. దక్షిణాఫ్రికాకు మార్చుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జోక్యం లేకుండా క్రికెట్​ వ్యవహారాలను మేనేజ్​ చేయడంలో శ్రీలంక క్రికెట్​ బోర్డు విఫలమైంది. ఈ కారణంగా ఐసీసీ.. ఎస్​ఎల్​​సీపై ఇటీవల సస్పెన్షన్​ వేటు వేసింది. అయితే తాజాగా.. శ్రీలంక జట్లు ద్వైపాక్షిక సిరీస్​లు, ఐసీసీ ఈవెంట్​లలో పాల్గొనవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఇక నుంచి ఎస్​ఎల్​సీ వ్యవహారాలను ఐసీసీ చూసుకోనుందని తెలిపింది.

  • ICC Board announce new hosts for Men's U19 Cricket World Cup 2024 👀

    More ⬇️

    — ICC (@ICC) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పిచ్​ బ్యాన్​ ప్రక్రియలో మార్పు..
అంతర్జాతీయ క్రికెట్​లో పిచ్​ను నిషేధించే ప్రక్రియలో కూడా ఐసీసీ మార్పులు చేసింది. 'పిచ్, ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ నిబంధనలకు మార్పులు కూడా పాలక మండలి ఆమోదించింది.' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

మహిళ అంపైర్లకు సమాన వేతనం..
Woman Umpire In Cricket Equal Pay : పురుష అంపైర్లతో సమానంగా మహిళ అంపైర్లకు సమాన వేతనం ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఐసీసీ. వారు పురుషులు లేదా మహిళల మ్యాచ్​లకు అంపైర్లుగా వ్యవహరించినా సమాన వేతనం ఉంటుందని తెలిపింది. ఈ సమాన వేతనాన్ని 2024 జనవరి నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంచలనాత్మక నిర్ణయం.. క్రికెట్‌లో లింగ సమానత్వం పట్ల ఐసీసీకి ఉన్న నిబద్ధతను సూచిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.

పెళ్లిపీటలెక్కనున్న టీమ్​ఇండియా ప్లేయర్ వెంకటేశ్​ అయ్యర్-​ ఎంగేజ్​మెంట్ ఫొటోలు చూశారా?

టీమ్ఇండియా ఓటమిపై మైక్రోసాఫ్ట్​ సీఈఓ స్పందన- సత్య నాదెళ్ల ఏమన్నారంటే?

Last Updated : Nov 21, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.