త్వరలోనే టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) జరగనుంది. టెస్ట్ క్రికెట్లో తొలిసారి ఛాంపియన్షిప్ జరగనుండటం వల్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ(ICC) ట్వీట్ చేసిన ఓ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
2008 అండర్ 19 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్లో తలపడ్డాయి. అప్పటి భారత జట్టులో కోహ్లీ, జడేజా.. కివీస్ టీమ్‌లో కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ ఉన్నారు. ఈ నలుగురు త్వరలో జరగనున్న డబ్ల్యూటీసీలో ఉండటం సహా అప్పుడు, ఇప్పుడు సారథులుగా విరాట్(Kohli), విలియమ్సన్యే(Kane Williamson) కావడం విశేషం. అలా 13ఏళ్ల కిందట ఓ మెగా సెమీ ఫైనల్‌కు ఆడిన ఈ నలుగురు మరోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఐసీసీ దీనికి సంబంధించిన ఫొటోనే ట్వీట్ చేయగా.. వైరల్‌గా మారింది. జూన్ 18-22వరకు సౌథాంప్టన్ వేదికగా ఈ ఫైనల్ జరగనుంది.
-
The glow up of all glow ups.
— ICC (@ICC) June 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
From 2008 U19 @cricketworldcup semi-final talents, to #WTC21 final titans 🏏 pic.twitter.com/hBracC1m52
">The glow up of all glow ups.
— ICC (@ICC) June 8, 2021
From 2008 U19 @cricketworldcup semi-final talents, to #WTC21 final titans 🏏 pic.twitter.com/hBracC1m52The glow up of all glow ups.
— ICC (@ICC) June 8, 2021
From 2008 U19 @cricketworldcup semi-final talents, to #WTC21 final titans 🏏 pic.twitter.com/hBracC1m52
2008 అండర్-19 ప్రపంచకప్‌లో ఇరు జట్లు మధ్య జరిగిన ఈ సెమీఫైనల్లో టీమ్ఇండియా.. కివీస్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇదీ చూడండి: 'సోషల్ మీడియాతో భవిష్యత్ అలా ఉంటుంది'