ETV Bharat / sports

'ఇందౌర్‌ పిచ్‌ అత్యంత నాసిరకం'.. ఐసీసీ ఫుల్​ సీరియస్​! - బోర్డర్ గావస్కర్​ ట్రోఫీ ఆస్ట్రేలియా

భారత్​, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్​ పిచ్​పై ఐసీసీ సీరియస్​ అయింది. పిచ్‌ను మరి నాసిరకంగా తయారు చేశారని.. అందుకే హోల్కర్‌ స్టేడియానికి మూడు డీ-మెరిట్‌ పాయింట్లు విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.

icc-rates-indore-pitch-very-poor-hosted-ind-vs-aus-3rd-test

author img

By

Published : Mar 3, 2023, 9:08 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇందౌర్​ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా.. టీమ్​ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మొదట నుంచి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై 30 వికెట్లు కేవలం రెండు రోజుల్లోనే పడ్డాయి. అందులో 26 వికెట్లు ఇరు జట్ల స్పిన్నర్లు తీశారు. మిగతా నాలుగు వికెట్లు మాత్రమే పేసర్ల పడగొట్టారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ఇందౌర్ పిచ్‌పై సీరియస్‌ అయింది. ఆస్ట్రేలియా, టీమ్​ఇండియా మూడో టెస్టుకు ఉపయోగించిన పిచ్‌ను అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది. పిచ్‌ను మరి నాసిరకంగా తయారు చేశారని.. అందుకే హోల్కర్‌ స్టేడియానికి మూడు డీ-మెరిట్‌ పాయింట్లు విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. టెస్టుకు ఉపయోగించిన పిచ్‌పై ఐసీసీ పిచ్‌ అండ్‌ ఔట్‌ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్‌ బ్రాడ్‌ ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, స్టీవ్‌ స్మిత్‌లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది.

''పిచ్‌ చాలా డ్రైగా ఉంది. కనీసం బ్యాట్‌, బంతికి బ్యాలెన్స్‌ లేకుండా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ప్రారంభమయినప్పటికి క్రమంగా బౌన్స్‌ వస్తుందన్నారు. కానీ ఆ ప్రక్రియ మ్యాచ్‌లో ఎక్కడా జరగలేదు. ఎంతసేపు పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించిందే తప్ప సీమర్లకు కాస్త కూడా మేలు చేయలేదు. బంతి కనీసం బౌన్స్‌ కూడా కాలేదు. క్యురేటర్‌ పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారు'' అంటూ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఐసీసీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.