ICC Rankings : ఇదివరకు భారత ప్లేయర్లలో ఎవరైనా ఒక్కరు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్ చేరుకుంటే అది గొప్ప విషయంగా చెప్పుకునేవాళ్లం. అదేవిధంగా టీమ్ఇండియా ఏదో ఒక ఫార్మాట్లో అగ్రస్థానం దక్కించుకుంటే అది పెద్ద విశేషమే. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆయా ఫార్మాట్లలో టీమ్ఇండియా ప్లేయర్లు.. టాప్ ప్లేస్‌కు చేరుకోవడం సాధారణమైపోయింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ఆయా విభాగాల్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నారు.
టీ20 .. టీ20 క్రికెట్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి.. సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రీతిలో అదరగొడుతున్నాడు. ఫలితంగా 889 రేటింగ్స్‌తో చాలా కాలం నుంచి.. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే అతడు అరంగేట్రం చేసిన ఏడాదిలోపే టాప్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ బ్యాటర్ రిజ్వాన్ 811 రేటింగ్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య.. 240 రేటింగ్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
వన్డే.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ (694 రేటింగ్స్) బౌలింగ్ విభాగంలో రీసెంట్గా నెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో కెరీర్లో అతడు రెండోసారి వన్డేలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అతడు 2023 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో తొమ్మిదో ప్లేస్‌లో ఉన్న సిరాజ్.. అమాంతం ఎనిమిది స్థానాలు ఎగబాకి టాప్‌లోకి చేరుకున్నాడు. ఇక భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (638 రేటింగ్స్) తో తొమ్మిదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
-
Back to the 🔝
— BCCI (@BCCI) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to @mdsirajofficial on becoming the No.1️⃣ ranked bowler in ICC Men's ODI Bowler Rankings 👏👏#TeamIndia pic.twitter.com/ozlGmvG3U0
">Back to the 🔝
— BCCI (@BCCI) September 20, 2023
Congratulations to @mdsirajofficial on becoming the No.1️⃣ ranked bowler in ICC Men's ODI Bowler Rankings 👏👏#TeamIndia pic.twitter.com/ozlGmvG3U0Back to the 🔝
— BCCI (@BCCI) September 20, 2023
Congratulations to @mdsirajofficial on becoming the No.1️⃣ ranked bowler in ICC Men's ODI Bowler Rankings 👏👏#TeamIndia pic.twitter.com/ozlGmvG3U0
యువ సంచలనం శుభ్‌మన్ గిల్.. కొన్ని రోజుల నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. ఫలితంగా గిల్ ప్రస్తుతం 814 రేటింగ్స్‌తో.. బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్‌లో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ (857 రేటింగ్స్) టాప్‌లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న గిల్.. ప్రపంచకప్ కంటే ముందు టాప్ పొజిషన్‌కు చేరుకోవాలంటే మరో 130 పరుగులు చేయాలి. ఇక హార్దిక్ వన్డే ఆల్‌రౌండర్ జాబితాలో 243 పాయింట్లతో ఆరో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
టెస్టుల్లోనూ మనోళ్ల డామినేషన్.. టెస్టు బౌలర్లలో టీమ్ఇండియా స్పిన్నర్.. రవిచంద్రన్ అశ్విన్ 879 రేటింగ్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. 782 రేటింగ్స్‌తో రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో ఈ ఇద్దరే తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ 759 రేటింగ్స్‌తో పదో ప్లేస్‌లో ఉన్నాడు. టాప్ 10లో టీమ్ఇండియా నుంచి రోహిత్ ఒక్కడే ఉన్నాడు.
టాప్‌లో టీమ్ఇండియా.. మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో ఒకేసమయంలో టీమ్‌ఇండియా నెం.1 స్థానాన్ని దక్కించుకొని అరుదైన ఘనతను సాధించింది. ఇదివరకే టీ20, టెస్టుల్లో టాప్‌లో ఉన్న టీమ్ఇండియా.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజయంతో భారత్ ఈ ఫీట్ అందుకుంది. ప్రస్తుతం భారత్ టెస్టు లో118, వన్డేలో 116, టీ20లో 264 రేటింగ్స్‌తో ఉంది.
-
No. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH
">No. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iHNo. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH