ETV Bharat / sports

ICC ODI Rankings: కోహ్లీ, రోహిత్ ర్యాంకులు పదిలం.. టాప్​ 5లోకి డీకాక్​

ICC ODI Rankings: ఐసీసీ కొత్తగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో టీమ్​ ఇండియా బ్యాటర్లు విరాట్​ కోహ్లీ, కెప్టెన్​ రోహిత్​ శర్మ తమ ర్యాంకులను కాపాడుకున్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు.

ICC ODI Rankings
ICC ODI Rankings
author img

By

Published : Jan 26, 2022, 8:27 PM IST

Updated : Jan 26, 2022, 10:36 PM IST

ICC ODI Rankings: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. బ్యాటింగ్​ విభాగంలో టీమ్​ ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ, కెప్టెన్​ రోహిత్​ శర్మ తమ స్థానాలను కాపాడుకున్నారు. దక్షిణాఫ్రికాతో మూడో వన్డెల సరీస్​లో కోహ్లీ రెండు అర్ధ శతకాలు బాది రేటింగ్​ పాయింట్లను మెరుగుపర్చుకోగా.. రోహిత్ ఈ సిరీస్​ ఆడనప్పటికీ తన ర్యాంను పదిలపరుచుకున్నాడు. అయితే న్యూజిలాండ్ బ్యాటర్​ రాస్​ టేలర్​ తన రేటింగ్​ పాయింట్లు మెరుగుపరుచుకుని రోహిత్​కు సమానంగా నిలిచాడు.

ఈ సిరీస్​లో రాణించిన ఓపెనర్​ శిఖర్ ధావన్​ ఒక స్థానం మెరుగుపడి 15వ స్థానంలో నిలిచాడు.

భారత్​-దక్షిణాఫ్రికా వన్డే సిరిస్​లో సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్​ కీపర్​ బ్యాటర్​ క్వింటన్​ డీకాక్​ తన కెరీర్​లోనే అత్యుత్తమంగా 5 ర్యాంకుకు చేరుకున్నాడు. మరో బ్యాటర్ వాన్​డర్​ డస్సెన్​ 10 స్థానానికి దూసుకొచ్చాడు. మరో బ్యాటర్​ బవుమా ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు.

పాక్​ సారథి బాబర్​ ఆజమ్​ అగ్ర​స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

బౌలింగ్​లో ప్రొటీస్​ బౌలర్​ ఎంగిడి నాలుగు స్థానాలు మెరుగుపడి 20 స్థానానికి ఎగబాకాడు.

ఇదీ చూడండి: కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం.. భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ'

Last Updated : Jan 26, 2022, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.