ETV Bharat / sports

మెరుగుపడిన బుమ్రా.. రోహిత్​, కోహ్లీ ర్యాంకింగ్​ ఎంతంటే? - రవీంద్ర జడేజా

ICC Rankings: ఐసీసీ కొత్తగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో.. బౌలింగ్​ విభాగంలో భారత బౌలర్​ జస్ప్రిత్​ బుమ్రా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. బౌలింగ్​, ఆల్​రౌండర్​ విభాగంలో రవిచంద్రన్​ అశ్విన్​ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. వన్డే, టెస్టు బ్యాటింగ్​లో రోహిత్​​, కోహ్లీలు తమ తమ స్థానాల్లో కొనసాగుతున్నారు.

ICC Mens Player Rankings
మెరుగుపడిన బుమ్రా
author img

By

Published : Apr 6, 2022, 3:25 PM IST

ICC Rankings: ఆటగాళ్ల వన్డే, టెస్ట్​ ర్యాంకింగ్స్​ ప్రకటించింది ఐసీసీ. టెస్ట్​ ర్యాంకింగ్స్​ బౌలింగ్​ విభాగంలో భారత ప్రధాన బౌలర్​ జస్ప్రిత్​ బుమ్రా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్​, ఆల్​రౌండర్​ విభాగల్లో అశ్విన్​ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో బుమ్రా తన 6వ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వన్డే ఆల్​రౌండర్లలో రవీంద్ర జడేజా 224 పాయింట్లతో 10 స్థానంలో నిలవగా.. టెస్టు ఆల్​రౌండర్లలో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​: వన్డే బ్యాటింగ్​ ర్యాంక్సింగ్స్​లో పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ 891 పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతుండగా.. భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ 811 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ 791 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్​ బ్యాటర్​ బెయిర్​స్టో ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని న్యూజిలాండ్​ బ్యాటర్​ రాస్​ టెయిలర్​ను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ టెస్ట్​ ర్యాంకింగ్స్​: టెస్ట్​ బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా బ్యాటర్​ మార్నస్​ లబుసేన్​ తొలిస్థానంలో కొనసాగుతుండగా.. స్టీవ్​ స్మిత్​ రెండో స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ-8, విరాట్​ కోహ్లీ-10వ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. బౌలింగ్​ విభాగంలో పాట్​ కమిన్స్​ 901 పాయింట్లతో తొలిస్థానంలో ఉన్నాడు. ఆల్​రౌండర్​ విభాగంలో భారత్​ నుంచి రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​: టీ20 ర్యాంకింగ్స్​లో 805 పాయింట్లతో బాబర్​ అజామ్​ తొలి స్థానంలో ఉండగా.. భారత్​ నుంచి కేఎల్​​ రాహుల్​ 646 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. టీ20 బౌలింగ్, ఆల్​రౌండర్​​ విభాగంలో భారత్​ నుంచి ఏ ఒక్క ఆటగాడికి చోటు దక్కలేదు.

ఇదీ చూడండి: 'ఆ పర్యటన నా జీవితాన్నే మార్చేసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.