పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొననున్న జట్ల సంఖ్యను పెంచడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) యోచిస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో 16 జట్లు ఆడుతుండగా.. 2024 సీజన్లో 20 జట్లను బరిలోకి దించాలని ఐసీసీ సన్నాహాలు చేస్తున్నట్లు ఓ క్రీడా సంస్థ నివేదించింది.
ప్రస్తుత పొట్టి ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. దీంతో టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
50 ఓవర్ల ప్రపంచకప్‌లోనూ జట్ల సంఖ్య పెంచే దిశగా ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019కి ముందు వరకు 14 జట్లతో వరల్డ్‌కప్ నిర్వహణ సాగింది. ఏకపక్ష మ్యాచ్‌లను ఆడే జట్లను తప్పించాలని బ్రాడ్కాస్టర్లు సూచించారు. దీంతో జట్ల సంఖ్యను 10కి తగ్గించారు. ప్రస్తుతం తిరిగి 14కి టీమ్‌ల సంఖ్యను పెంచాలని ఐసీసీ యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: 'అందుకే నంబర్ వన్ స్థానంలో టీమ్ఇండియా'