అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నీ(Manu Sawhney) గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. సహచరులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడన్న కారణంగా మార్చిలో సాహ్నీని సెలవుపై పంపిన ఐసీసీ.. అతడిపై విచారణ ఆరంభించింది. ఈ నేపథ్యంలో సాహ్నీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన చేసింది.
"ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నీ వెంటనే ఐసీసీ నుంచి వెళ్లిపోతాడు. జెప్ అలార్డీస్ తాత్కాలిక సీఈఓగా కొనసాగుతాడు."
- అంతర్జాతీయ క్రికెట్ మండలి
2019 ఐసీసీ ప్రపంచకప్ అనంతరం డేవ్ రిచర్డ్సన్(Dave Richardson) నుంచి సాహ్నీ ఐసీసీ సీఈఓగా బాధ్యతలు అందుకున్నాడు. 2022 వరకు అతడి పదవీకాలం ఉంది. వివిధ విధానపరమైన నిర్ణయాల విషయంలో పెద్ద బోర్డులతో అతడికి విభేదాలున్నాయి. నిరంకుశంగా వ్యవహరిస్తాడన్నది సాహ్నీపై ఆరోపణ.
ఇదీ చూడండి.. ICC Rankings: మళ్లీ అదే స్థానాల్లో బాబర్, కోహ్లీ