ETV Bharat / sports

కామన్వెల్త్​ క్రీడల్లో పాల్గొనే క్రికెట్​ జట్లు ఇవే...

author img

By

Published : Apr 26, 2021, 5:32 PM IST

వచ్చే ఏడాది బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే మహిళల క్రికెట్​ జట్లను ప్రకటించింది ఐసీసీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసింది.

ICC announces qualification process, for 2022 Commonwealth Games
అంతర్జాతీయ క్రికెట్ మండలి, కామన్వెల్త్ క్రీడలు

వచ్చే ఏడాది బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న కామన్వెల్త్​ క్రీడల్లో.. మహిళ క్రికెట్ నుంచి ఆరు అర్హత జట్లను వెల్లడించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). కామన్వెల్త్​ గేమ్స్​ సమాఖ్యతో కలిసి అధికారిక ప్రకటన చేసింది. 2022 జులై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక పోటీలు జరగనున్నాయి.

ఈ పోటీల కోసం మొత్తం 8 జట్లను ప్రకటించాల్సి ఉంది. క్రీడలకు ఆతిథ్యమిస్తున్నందుకు ఇంగ్లాండ్​.. క్రికెట్ నుంచి స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్​ నుంచి ఓ జట్టు ఈ అర్హత జట్లలో స్థానం దక్కించుకున్నాయి. వీటన్నింటినీ 2021 ఏప్రిల్​ 1 వరకు టీ20ల్లో ఉన్న ర్యాంకుల ఆధారంగా నిర్ణయించారు. మరో టీమ్​ను వచ్చే ఏడాది జనవరి 31న ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి: 'ఆటగాళ్లు నిష్క్రమిస్తున్నా.. ఐపీఎల్​ కొనసాగుతుంది'

ఇప్పటివరకు 22 సార్లు కామన్వెల్త్​ క్రీడలను నిర్వహించగా.. అందులో క్రికెట్​ భాగమవ్వడం ఇది రెండో సారి మాత్రమే. 1998లో కౌలాలంపుర్​లో జరిగిన ఈవెంట్​లో పరుషుల క్రికెట్​కు అవకాశం లభించింది. అప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించి.. గోల్డ్​ మెడల్​ను కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: 'పీఎం కేర్స్​'కు ఆసీస్​ పేసర్​ కమిన్స్ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.