'పంత్ కెప్టెన్ అవ్వకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని' - రిషభ్ పంత్
రిషభ్ పంత్‌ను కెప్టెన్ అవ్వకుండా కచ్చితంగా అడ్డుకునేవాడినని చెప్పాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మదన్‌లాల్. భారత జట్టుకు నాయకత్వం వహించాలంటే సాధారణ విషయం కాదని, అందుకు పంత్ ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని అన్నాడు.
టీమ్ఇండియా వికెట్‌కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ కెప్టెన్ అవ్వకుండా అడ్డుపడేవాడినని తెలిపాడు మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలక్టర్ మదన్‌లాల్. భారత జట్టుకు నాయకత్వం వహించడానికి బాధ్యత తెలిసి ఉండాలని, పంత్ ఇంకా కుర్రాడే అని అన్నాడు. పంత్ కెప్టెన్సీని ఎం.ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ శైలితో పోలిస్తూ.. నాయకుడిగా పోటీలో ఉండాలంటే అతడికి ఇంకా కనీసం రెండేళ్లు అయినా పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో 2-2తో ముగిసిన 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు పంత్.
"పంత్ కెప్టెన్ అవ్వకుండా నేను కచ్చితంగా అడ్డుకునేవాడిని. ఎందుకంటే ఇలాంటి ఆటగాడికి ఆ బాధ్యతను ఇప్పుడే ఇవ్వకూడదు. టీమ్ఇండియా కెప్టెన్సీ అంటే సాధారణ విషయం కాదు. పంత్ ఇంకా కుర్రాడే. ఎక్కడికీ వెళ్లడు. ఆడే కొద్దీ అతడు పరిణతి చెందుతాడు. రాబోయే రెండేళ్లలో తన ఆటతీరును మరింత మెరుగు పరచుకుంటే అప్పుడు అతను మంచి సారథి కాగలడు. పరిపక్వతతో కూడిన నిర్ణయాలు తీసుకోగలడు. పంత్ ఒక విభిన్న స్వభావం కలిగిన ఆటగాడు. ధోనీ కూల్ కెప్టెన్. కోహ్లీ అద్భుతమైన బ్యాటర్. పంత్ దూకుడుగా ఆడకూడదని నేనడం లేదు. కానీ కొంచెం పరిణతితో ఆడితే బాగుంటుంది."
-మదన్ లాల్, మాజీ క్రికెటర్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు పంత్. గాయం కారణంగా కేఎల్ రాహుల్ వైదొలగడం వల్ల ఈ పర్యటనకు తాత్కాలిక కెప్టెన్‌గా అతడు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత్.. తదుపరి రెండింట్లో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. కాగా, నిర్ణయాత్మక ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయ్యింది.
ఇదీ చూడండి: Virat Kohli Covid: విరాట్ కోహ్లీకి కరోనా.. అక్కడికి వెళ్లిన తర్వాతే..!